1st T20 at Wellington: టీమిండియా విజయ లక్ష్యం 160

హైదరాబాద్: వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరిస్‌లో భారత మహిళల జట్టుకు ఆతిథ్య జట్టు 160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌ను ఆహ్వానించింది.
న్యూజిలాండ్ బ్యాట్స్‌వుమెన్‌లో సోఫీ డివైన్(62) అర్ధశతకంతో రాణించడంతో ఆతిథ్య జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, దీప్తీ శర్మ, పూనమ్ యాదవ్ తలో వికెట్ తీసుకున్నారు.
ఇప్పటికే 2-0తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత మహిళలు టీ20 సిరీస్‌ను కూడా సాధించాలనే పట్టుదలతో ఉంది. ఇదే వేదికపై మహిళల మ్యాచ్ అనంతరం భారత్, న్యూజిలాండ్ పురుషుల టీ20 మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. తొలి టీ20లో తెలుగమ్మాయి అరుంధతి రెడ్డికి కూడా తుది జట్టులో చోటు దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications