ఈ సర్జరీగాడా సాయం చేసేది.. షేన్ వార్న్‌పై శ్యామ్యూల్స్ అసభ్యకర కామెంట్స్

హైదరాబాద్: ఓ అంతర్జాతీయ క్రికెటరనే సోయి మరిచి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్న వెస్టిండీస్ క్రికెటర్ మార్లోన్ శామ్యూల్స్‌ మరోసారి తన నోటికి పనిచెప్పాడు. అతని తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నా ఈ విండీస్ క్రికెటర్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. తాజాగా ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్‌పై నోరుపారేసుకున్నాడు.

రాయలేని పదాలతో తిట్లదండకం అందుకున్నాడు. అయితే తనతో పాటు బెన్ స్టోక్స్ భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శామ్యూల్స్‌పై షేన్ వార్న్ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ సాధారణ ఆటగాడికి మతి చెడిందని, ఎవరైనా సాయం చేయాలన్నాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన శ్యామూల్స్... ముఖానికి సర్జరీ చేసుకున్న ఈ ఆటగాడు సాయం చేస్తడంటా.. హహహ'అని కామెంట్ చేశాడు.

సర్జరీ చేసుకున్న ఆటగాడంటూ..

సర్జరీ చేసుకున్న ఆటగాడంటూ..

‘హహహ.. యవ్వనంగా కనబడటం కోసం ముఖానికి సర్జరీ చేసుకున్న ఈ ఫస్ట్ క్రికెటర్ నాకు సాయంచేస్తాడంటా'అని తన ఇన్ స్టా స్టోరిలో రాసుకొచ్చాడు. అంతటితో ఆగకుండా సర్జరీ టైమ్‌లో వార్న్, డాక్టర్ మధ్య సంభాషణ ఇలా ఉందని కొన్ని వ్యాఖ్యలను జత చేశాడు. ‘డాక్టర్.. ఫేస్ సర్జరీకి కావాల్సిన చర్మాన్ని నా పొట్ట బాగంలో నుంచి తీసుకోండి.'అని వార్నర్ అనగా.. ‘కంగరాపడకు గాడిద ముఖపోడా.. నీ సర్జరీకి మేం నీ ** నుంచి తీసిన చర్మాన్ని వాడుతాం'అని డాక్లర్ అన్నట్లు ఉన్న వ్యాఖ్యలను జత చేశాడు.

శామ్యూల్స్ మతి చెడింది..

శామ్యూల్స్ మతి చెడింది..

అంతకు ముందు ఎవరి తోడు, స్నేహం లేక శామ్యూల్స్ పిచ్చోడవుతున్నాడని, అతని ఎవరైనా సాయం చేయాలని ట్వీట్ చేశాడు. 'నాతో పాటు స్టోక్స్‌పై చేసిన వ్యాఖ్యలను ఇప్పుడే తిరిగి శామ్యూల్స్‌కు పంపించా. అతని వ్యాఖ్యలు సరైనవి కావు. ఒక వ్యక్తిని కించపరుస్తూ మాట్లాడడంతో పాటు కుటుంబ సభ్యులను కూడా ఇందులోకి లాగడం బాధాకరమైన విషయం. శామ్యూల్స్‌కు మతి చెడింది.. ఇప్పుడు అతనికి సహాయం అవసరం. కానీ దురదృష్టం కొద్దీ అతనికి స్నేహితులు ఎవరు లేరు.. కనీసం తోటి క్రికెటర్లు కూడా అతనికి సాయంగా రారు. ఎందుకంటే అతనొక సాధారణ క్రికెటర్‌.. అందుకే ఎవరి వద్ద నుంచైనా వెంటనే సాయం కోరు 'అని వార్న్ ట్వీట్ చేశాడు.

ఎలా మొదలైందంటే..

ఎలా మొదలైందంటే..

బీబీసీ చిట్ చాట్‌లో శామ్యూల్స్ పేరు ప్రస్తావిస్తూ స్టోక్స్ చేసిన కామెంట్స్‌తో శామ్యూల్స్ బూతుపురాణానికి తెరలేసింది. తల్లిదండ్రుల అనారోగ్యం కారణంగా పాకిస్థాన్‌ టెస్ట్ సిరీస్ నుంచి అర్దాంతరంగా తపుకున్న స్టోక్స్ న్యూజిలాండ్ బయల్దేరిన విషయం తెలిసిందే. అతను కరోనా ప్రొటోకాల్స్ ప్రకారం అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన హోటల్స్‌లో 14 రోజుల క్వారంటైన్ పాటించాడు. అయితే ఈ క్వారంటైన్ పరిస్థితి గురించి మాట్లాడిన స్టోక్స్.. ఈ పరిస్థితి పగవాడికి కూడా రాకుడదని, తాను బద్ద శత్రువుగా భావించే శ్యామూల్స్‌కు కూడా రావద్దని కోరుకుంటానని సరాదాగా చెప్పుకొచ్చాడు.

స్టోక్స్ నోట పేరు రావడమే..

స్టోక్స్ నోట పేరు రావడమే..

స్టోక్స్ నోట తన పేరు రావడమే తప్పుగా భావించిన శ్యామూల్స్.. అతని వ్యాఖ్యలను అపార్దం చేసుకొని అసభ్యకర కామెంట్స్ చేశాడు. తన ఇన్ స్టా స్టోరీల్లో రాయలేని పదాలతో తిట్ల దండకాన్ని అందుకున్నాడు.‘ఈ తెల్లోడు ఇంకా నా గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. 14 రోజులు నీ భార్యను పంపించరా.. 14 సెకన్లలో జమైకన్‌గా మార్చుతా.'అంటూ అసభ్య పదజాలంతో బూతుపురాణం అందుకున్నాడు. అలాగే షేన్ వార్న్‌పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అలా ఇంగిత జ్ఞానం లేకుండా వరుసగా కామెంట్స్ చేస్తూనే ఉన్నాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Friday, October 30, 2020, 17:30 [IST]
Other articles published on Oct 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X