హైదరాబాద్: వెస్టిండిస్‌తో ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా ప్రారంభమైన తొలి వన్డేకు వర్షం అడ్డంకిగా మారింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓపెనర్లు రాణించారు. ఇటీవల కాలంలో జోరు మీదున్న ఓపెనర్ శిఖర్ ధావన్‌కు రహానె తోడుగా ఇన్నింగ్స్ నిర్మించాడు.

ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మతో కలిసి తొలి వికెట్‌కు చక్కటి భాగస్వామ్యాలు నెలకొల్పిన శిఖర్ ధావన్ ఈ మ్యాచ్‌లో రహానెతో కలిసి మరోసారి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆకాశం మేఘావృతమై ఉండటం, పిచ్ నెమ్మదిగా ఉండడంతో జోడీ భారీ షాట్లు ఆడలేదు.
కమిన్స్ వేసిన 21వ ఓవర్లో ఫోర్ కొట్టి 63 బంతుల్లో రహానే అర్ధసెంచరీ సాధించాడు. దీంతో ఆ ఓవర్లో భారత స్కోరు వంద పరుగులు దాటింది. ఆ తర్వాత కాసేపటికే ధావన్ ఓ సిక్స్‌తో అర్ధ సెంచరీ సాధించాడు. గత ఆరు ఇన్నింగ్స్‌లలో ధావన్‌కి ఇది నాలుగో అర్ధసెంచరీ కావడం విశేషం.

జోసెఫ్ వేసిన స్లో బంతిని ఆడబోయిన రహానె, జాసన్ హోల్డర్‌కు క్యాచ్ ఇచ్చాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 132 పరుగులు జోడించారు. ఈ సమయంలో ధావన్ సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే బిషూ బౌలింగ్‌లో వికెట్ల ముందు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన యువీ 4 పరుగులకే అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధోనితో కలిసి కోహ్లీ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. 38 ఓవర్ల వరకు మ్యాచ్ బాగానే జరిగింది. 38వ ఓవర్ ముగిసిన తర్వాత వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. వర్షం తగ్గాక మళ్లీ ఆట మొదలైనా.. 40వ ఓవర్‌లో మళ్లీ ఆగిపోయింది. వర్షంతో ఆట నిలిచిపోయే సమయానికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది.
అంతకముందు టాస్ గెలిచిన వెస్టిండిస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. రవీంద్ర జడేజాకు బదులు తుది జట్టులో యువ బౌలర్ కుల్దీప్ యాదవ్ వన్డేల్లో అరంగేట్రం చేశాడు. తొలుత అశ్విన్ స్థానంలో కుల్దీప్‌ను తీసుకుంటారని అందరూ భావించగా.. చివరి నిమిషంలో జడేజా బదులుగా కొత్త కుర్రాడికి అవకాశం ఇచ్చారు. ఆకాశం మేఘావృతమై ఉండటంతో వాతావరణంలో తేమ మ్యాచ్‌పై ప్రభావం చూపే అవకాశాలున్నాయి.

ఈ మ్యాచ్‌తో యువరాజ్ మరో అరుదైన ఘనతకు సాధించాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే అతడి 400వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. 40 టెస్టులు ఆడిన యువీ 33.92 యావరేజితో 1900 పరుగులు చేశాడు. 301 వన్డేల్లో 36.78 సగటుతో 8,644 పరుగులు, 58 టీ20ల్లో 28.02 యావరేజితో 1177 పరుగులు సాధించాడు.
అంతేకాదు వెస్టిండిస్ జట్టుతో యువీ అడుతున్న వన్డే అతడి కెరీర్‌లో 302వ వన్డే. భారత్‌లో సచిన్ తెందుల్కర్ (463), గంగూలీ (311), రాహుల్ ద్రవిడ్ (344), అజారుద్దీన్ (334) తర్వాత 300 వన్డేలు ఆడిన ఆటగాడు యువరాజ్ కావడం విశేషం.
విండీస్: హోల్డర్ (కెప్టెన్), లూయిస్, మొహమ్మద్, రోస్టన్ చేజ్, జేఎల్ కార్టర్, పావెల్, హోప్, నర్స్, దేవెంద్ర బిషూ, జోసెఫ్, కమిన్స్.