Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వన్డేల్లో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు (ఫోటోలు)

హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని నుంచి కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించిన విరాట్ కోహ్లీ భారత జట్టుకు వరుస విజయాలనందిస్తున్న సంగతి తెలిసిందే. అటు టెస్టుల్లోనే కాదు, వన్డేల్లో కూడా జట్టుకు స్ఫూర్తివంతమైన నాయకుడిగా ముందుండి విజయాల బాట పట్టిస్తున్నాడు.

తొలి వన్డేలో కోహ్లీసేన విజయం

తొలి వన్డేలో కోహ్లీసేన విజయం

తాజాగా ఆదివారం చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 26 పరుగులతో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కెప్టెన్‌గా కోహ్లీకి ఈ విజయం 28వ విజయం కావడం విశేషం. ఈ విజయంతో కోహ్లీ, మొత్తంగా 50 ఓవర్ల ఫార్మాట్‌లో 80 శాతం విజయాలు సాధించిన తొలి కెప్టెన్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వీటిలో టీమిండియా ఎక్కువగా ఛేజింగ్‌లోనే చేయడం విశేషం. 2016లో 10 వన్డేలాడిన కోహ్లీ 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలతో 739 పరుగులు చేశాడు. ఈ ఏడాది ఇప్పటివరకూ ఆడిన 19 వన్డేల్లో 4 సెంచరీలు, 6 హాఫ్‌ సెంచరీలతో 1,017 పరుగులు సాధించాడు.

ఈ ఏడాది జనవరిలో ధోని నుంచి బాధ్యతలు

ఈ ఏడాది జనవరిలో ధోని నుంచి బాధ్యతలు

ఈ ఏడాది ఆరంభంలో మహేంద్రసింగ్ ధోని నుంచి పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతలను కోహ్లీ స్వీకరించిన సంగతి తెలిసిందే. జనవరి నుంచి 36 వన్డేలకి కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించగా.. ఇందులో 28 విజయాలు, 7 ఓటములు, ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. గత రెండేళ్లలో వన్డేల్లో కనీసం ఒకసారి కూడా డకౌట్ అవని కోహ్లీ.. కెప్టెన్‌గా మారిన తర్వాత రెండు సార్లు డకౌటయ్యాడు.

తొలి వన్డేలో విరాట్ కోహ్లీ డకౌట్‌

తొలి వన్డేలో విరాట్ కోహ్లీ డకౌట్‌

ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ప్రస్తుతం జరుగుతున్న తొలి వన్డేలో విరాట్ కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 5.1 ఓవర్‌ వద్ద కౌల్టర్‌ నైల్‌ వేసిన బంతిని కోహ్లీ బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా బాదాడు. అదే సమయంలో అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న మ్యాక్స్‌వెల్ జంప్ చేసి ఒంటిచేత్తో దానిని అందుకున్నాడు.

వన్డే కెరీర్‌లో 12 సార్లు ఖాతా తెరవకుండానే

వన్డే కెరీర్‌లో 12 సార్లు ఖాతా తెరవకుండానే

మాక్స్‌వెల్‌ అద్భుతమైన క్యాచ్‌‌తో కెప్టెన్ కోహ్లీ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. అంతకుముందు జూన్ 8న ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంకపై కోహ్లీ డకౌటయ్యాడు. మొత్తంగా కోహ్లీ తన వన్డే కెరీర్‌లో 12 సార్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఇదిలా ఉంటే గురువారం ఆసీస్‌తో ఈడెన్‌ గార్డెన్స్‌లో భారత్ రెండో వన్డే ఆడనుంది.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+