దర్బన్ మొదటి వన్డేలో దక్షిణాఫ్రికాపై భారత్ ఓటమి

లక్ష్యఛేదనలో భారత్‌కు తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. మురళీ విజయ్ (1)ను స్టెయిన్ ఎల్బీగా ఔట్ చేశాడు. కొద్దిసేపటికే షాక్. 11 నెలల తర్వాత వన్డే ఆడుతున్న సచిన్ (7) ఔటయ్యాడు. సొత్సొబె వేసిన ఇనింగ్స్ నాలుగో ఓవర్లో స్టెయిన్‌కు క్యాచ్ ఇచ్చాడు. మోర్కెల్ ఒకే ఓవర్లో రోహిత్ (11), యువీ (2)లను ఔట్ చేసి భారత్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. ధోనీ (25) రనౌట్‌తో గెలుపు ఆశలు ఆవిరయ్యాయి. రైనాతో కలిసి కోహ్లి కాసేపు పోరాడాడు. కానీ రెండో స్పెల్‌తో స్టెయిన్ మరోసారి భారత్‌ను దెబ్బతీశాడు. అర్ధసెంచరీ చేసిన కోహ్లిని పెవిలియన్ పంపాడు. తర్వాత లాంఛనం ముగియడానికి ఎంతోసేపు పట్టలేదు.
ఆమ్లా (50; 36 బంతుల్లో 8X4) వన్డేల్లోనూ ఫామ్‌ను కొనసాగించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జట్టుకు శుభారంభాన్ని అందించాడు. స్మిత్ (11) ఎక్కువసేపు క్రీజులో నిలవకపోయినా కొలిన్ ఇంగ్రామ్ (5) విఫలమైనా జట్టు భారీ స్కోరుకు బాటలు వేశాడు. నెహ్రాను అసలు కోలుకోకుండా చేశాడు. అతడు వేసిన తొలి బంతినే బౌండరీకి పంపి ఎదురుదాడికి దిగాడు. ఆరో ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. దాంతో ఎనిమిదో ఓవర్లోనే ధోనీ మునాఫ్‌కు బౌలింగ్ అప్పగించాడు. అయినా ఆమ్లా జోరు తగ్గలేదు. జహీర్ బౌలింగ్‌లోనూ స్వేచ్ఛగా షాట్లు కొట్టిన ఆమ్లా 35 బంతుల్లో 8 ఫోర్లతో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరింత వేగంగా ఆడే ప్రయత్నంలో మునాఫ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అతడు మిడాన్‌లో షాట్ కొట్టగా హర్భజన్ వెనక్కి పరుగెడుతూ చక్కటి క్యాచ్ పట్టాడు.
ఆమ్లా ఔటయ్యాక పరుగుల వేగం తగ్గింది కానీ టీమ్‌ఇండియాకు కష్టాలు పెరిగాయి. డివిలియర్స్, డుమిని సెంచరీ భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను నిర్మించారు. మొదట వీరిద్దరూ సింగిల్స్, డబుల్స్‌తో స్కోరు బోర్డును నడిపించారు. దీంతో 13వ ఓవర్ నుంచి 25వ ఓవర్ వరకు దక్షిణాఫ్రికాకు ఒక్క ఫోర్ కూడా లభించలేదు. అప్పటి వరకు పరిస్థితి భారత నియంత్రణలోనే ఉందనిపించింది. కానీ.. ఒక్క షాట్ మ్యాచ్ గమనాన్ని మార్చేసింది. హర్భజన్ వేసిన 26వ ఓవర్లో పిచ్‌పై ముందుకు వస్తూ.. డివిలియర్స్ ఆ షాట్ కొట్టాడు. బంతి నేరుగా స్టాండ్స్‌లోని ప్రేక్షకుల వద్ద పడింది. అక్కడి నుంచి దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ఒక్కసారిగా జోరందుకుంది. యువీ వేసిన తర్వాతి ఓవర్లో డుమిని కూడా సిక్స్ కొట్టాడు. బ్యాట్స్‌మెన్ ఊపులోకి రావడంతో 28వ ఓవర్లో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ పవర్‌ప్లే తీసుకుంది. డివిలియర్స్ ఎడాపెడా బౌండరీలు బాదడంతో స్కోరు బోర్డు పరుగులెత్తింది. డుమిని అతడికి సహకరించాడు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు.
పార్ట్‌టైమ్ స్పిన్నర్లు రోహిత్ (2/30), రైనా (1/21) దక్షిణాఫ్రికా జోరుకు బ్రేకులేశారు. రోహిత్ తన తొలి ఓవర్లోనే డివిలియర్స్‌ను పెవిలియన్ పంపాడు. భారీ షాట్ ఆడబోయిన డివిలియర్స్.. హర్భజన్‌కు చిక్కాడు. కొద్దిసేపటికే మిల్లర్ (9)ను రైనా బౌల్డ్ చేశాడు. డుమిని కూడా నిష్క్రమించడంతో దక్షిణాఫ్రికా స్కోరు మందగించింది. రోహిత్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నంలో డుమిని వికెట్ల ముందు దొరికిపోయాడు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సఫారీ జట్టు ఇబ్బంది పడింది. బోథా (23), పార్నెల్ (21 నాటౌట్) రాణించకుంటే భారత్ మెరుగైన స్థితిలో ఉండేది. జహీర్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు (స్టెయిన్, మోర్కెల్) తీశాడు. చివరి పది ఓవర్లలో దక్షిణాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసింది. నెహ్రా ఆరు ఓవర్లలో 61 పరుగులు సమర్పించుకున్నాడు.
స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: గ్రేమ్ స్మిత్ (సి) రోహిత్ (బి) నెహ్రా 11; ఆమ్లా (సి) హర్భజన్ (బి) మునాఫ్ 50; ఇంగ్రామ్ (సి) నెహ్రా (బి) మునాఫ్ 5; డివిలియర్స్ (సి) హర్భజన్ (బి) రోహిత్ 76; డుమిని ఎల్బీ (బి) రోహిత్ 73; మిల్లర్ (బి) రైనా 9; బోథా (బి) హర్భజన్ 23; పార్నెల్ నాటౌట్ 21; స్టెయిన్ (సి) యువరాజ్ (బి) జహీర్ 7; మోర్కెల్ (బి) జహీర్ 0; సొత్సొబె నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 13 మొత్తం: (50 ఓవర్లలో 9 వికెట్లకు) 289
వికెట్ల పతనం: 1-21, 2-72, 3-82, 4-213, 5-226, 6-244, 7-266, 8-285, 9-286
బౌలింగ్: జహీర్ 10-0-44-2; నెహ్రా 6-0-61-1; మునాఫ్ 7-1-36-2; హర్భజన్ 10-0-56-1; యువరాజ్ 6-0-32-0; రోహిత్ 7-0-30-2; రైనా 4-0-21-1
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications