Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అదరగొట్టిన రాహుల్: జింబాబ్వేపై భారత్ విక్టరీ

హరారే: జింబాబ్వేపై హారారేలో జరిగిన తొలి వన్డే మ్యాచులో భారత్ అదరగొట్టింది. జింబాబ్వేపై భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జింబాబ్వే విధించిన 169 పరుగుల విజయలక్ష్యాన్ని 42.3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. భారత్ 173 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ మాత్రమే 7 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

ఆ తర్వాత కెఎల్ రాహుల్, అంబటి రాయుడు నడిపించారు. కెఎల్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు.100 పరుగులు చేశాడు. రాయుడు అద్భుతంగా ఆడి 62 పరుగులు చేశాడు. రాహుల్ 115 బంతుల్లో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. 42వ ఓవర్‌లో సిక్సర్ కొట్టడం ద్వారా సెంచరీని సాధించి భారత్‌కు విజయాన్ని అందించాడు. అరంగేట్రంలోనే సెంచరీ చేసిన భారత తొలి బ్యాట్స్‌మన్‌గా రాహుల్ నిలిచాడు.

Jasprit Bumrah

అంతకు ముందు 2006లో ఇంగ్లాండుపై ఇండోర్‌లో ఇంగ్లాండుపై జరిగిన వన్డేలో రాబిన్ ఉతప్ప నమోదు చేసి రికార్డు తెరమరుగైంది. ఈ మ్యాచులో ఊతప్ప ఓపెనర్‌గా వచ్చి 86 పరుగులు చేశాడు. పదేళ్ల తర్వాత ఉతప్ప రికార్డును రాహుల్ బద్దలు కొట్టాడు.

భారత విజయానికి ఇంకా రెండు పరుగులే అవసరమైనా.. శతకం చేయడానికి మరో ఆరు పరుగులు కావాల్సి ఉండటంతో రాహుల్‌ అద్భుతమైన సిక్సర్‌ బాది వంద పరుగులు పూర్తిచేశాడు. అంబటి రాయుడు తన వన్డే కెరీర్‌లో ఆరో అర్థ సెంచరీ సాధించాడు. అదే సమయంలో వేయి పరుగుల మైలురాయిని కూడా దాటాడు.

మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా జింబాబ్వే, భారత్‌ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగారు. హరారే వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న భారత బౌలర్ల ధాటికి జింబాబ్వే 49.5 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది.

భారత పేసర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా (4/28), బరిందర్‌ శరణ్‌ (2/42), కులకర్ణి (2/42) జింబాబ్వే టాప్‌ ఆర్డర్‌‌ను పెవిలియన్‌కు చేర్చగా, స్పిన్నర్లు అక్షర్‌ పటేల్‌ (1/26), చాహల్‌ (1/27) పొదుపుగా బౌలింగ్‌ చేసి జింబాబ్వే బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు.

వెస్టిండిస్ టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన చిగుంబర 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సికిందర్ రాజా (23), ముతుంబామి (15), ఎర్విన్ (21) పరుగులతో ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు. మ్యాచ్ ప్రారంభం నుంచే జింబాబ్వే ఆటగాళ్లను భారత్ బౌలర్లు కట్టడి చేశారు.

బరీందర్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే జింబాబ్వే ఓపెనర్ పీటర్ మూర్‌ను అవుట్ చేశాడు. ఆ తర్వాత మసకద్జ(14)ను కులకర్ణి పెవిలియన్‌కు పంపాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన చిబాబా 42 బంతుల్లో 13 పరుగులు, సిబింద 21 బంతుల్లో 5 పరుగులు చేసిన నిలకడగా రాణిస్తున్నారని అనుకుంటున్న తరుణంలో వారిద్దరిని జస్‌ప్రీత్‌ బుమ్రా ఔట్‌ చేయడంతో జింబాబ్వే 20 ఓవర్లలో 4 వికెట్లను కోల్పోయి 70 పరుగులు చేసింది.

భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్వాం 12.30 గంటలకు హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో ఈ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ ధోని బౌలింగ్ ఎంచుకున్నాడు. జింబాబ్వే పర్యటనలో సీనియర్‌ క్రికెటర్లకు సెలక్టర్లు విశ్రాంతినివ్వడంతో భారత్‌ జట్టులోకి ముగ్గురు యువ ఆటగాళ్లకు చోటు లభించింది.

ఇటీవల ముగిసిన ఐపీఎల్‌-9 లో సత్తాచాటిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు యువ క్రికెటర్లు కేఎల్‌ రాహుల్‌, చాహల్‌తో పాటు దిల్లీ డేర్‌డెవిల్స్‌ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ కరుణ్‌ నాయర్‌ తాజాగా జింబాబ్వేతో మ్యాచ్‌లో వన్డేల్లోకి అరంగేట్రం చేశారు. వన్డేలో అరంగేట్రం చేసిన యుజువేంద్ర చాహల్, కెఎల్ రాహుల్, కరుణ్ నాయర్... కెప్టెన్ ధోని చేతుల మీదగా వన్డే క్యాప్‌లను అందుకున్నారు.

యువ ఆటగాళ్లతో నిండిన జట్టు కావడంతో ఈ సిరిస్ ధోనికి పెద్ద సవాల్‌గా మారింది. మరోవైపు మిడిలార్డర్‌లో జట్టు అవసరాలకు తగినట్లు ఆడటంతో అనుభవం ఉన్న కరుణ్‌ నాయర్‌ భవితవ్యం ఈ పర్యటనలో తేలనుంది. ఇక, ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో నిలిచిన చాహల్‌ విదేశీ గడ్డపై ఏ మేరకు రాణిస్తాడో అన్న ఆసక్తి నెలకొంది.

2005లో సౌరభ్ గంగూలీ నేతృత్వంలోని భారత జట్టు జింబాబ్వేలో పర్యటించింది. ఆ జట్టులో ఉన్న ధోని కూడా ఉన్నాడు. అప్పటికి అంతర్జాతీయ క్రికెట్‌లోకి ధోని అరంగేట్రం చేసి కేవలం ఆరు నెలలు కావడం విశేషం.

జట్ల వివరాలు:

ఇండియా: ధోని (కెప్టెన్), కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, మన్‌దీప్ సింగ్, మనీశ్ పాండే, చహల్, ఫజల్, ధావల్ కులకర్ణి, అక్షర్ పటేల్, ఉనాద్కట్, బుమ్రా, రిషి ధావన్, బరీందర్, జయంత్ యాదవ్

జింబాబ్వే: క్రీమర్ (కెప్టెన్), చిబాబా, చిసోరో, మద్జివా, హామిల్టన్ మసకద్జా, పీటర్ మూర్, రిచ్‌మండ్, సిబాందా, ట్రిపానో, చటారా, చిగుంబురా, ఇర్విన్, మరుమా, వెలింగ్టన్ మసకద్జా, ముపరివ, ముజరబని, సికందర్ రజా, సీన్ విలియమ్స్.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+