For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ గెలుపు: కోహ్లీ-జాదవ్ శతకాలు, కెప్టెన్.. మధ్యలో తొందరపడిన ధోనీ

భారత్ - ఇంగ్లాండ్ మధ్య జరగనున్న వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

పుణే: తొలి వన్డేలో భారత్ మూడు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ పైన విజయం సాధించింది. కోహ్లీ, కేదార్ జాదవ్‌లు అద్భుతంగా రాణించడంతో భారత్ ఇంగ్లాండ్ పైన గెలిచింది. తొలుత ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 350 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన భారత్ 48.1 ఓవర్లో 356 పరుగులు చేసింది.

అంతకుముందు, టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పుణేలో భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి వన్డే. కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాక కోహ్లీకి ఇది తొలి మ్యాచ్.

27వ ఓవర్లో తొందరపడిన ధోనీ

ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డేలో ధోనీ తొందరపడ్డారు. ఓ క్షణం తర్వాత ధోనీ తన పొరపాటు గ్రహించి సర్దుకున్నారు. ధోనీలోని కెప్టెన్ ఒక్కసారిగా బయటకు వచ్చాడు. 27 ఓవర్లో హార్దిక్ పాండే బౌలింగ్ వేశాడు. మోర్గాన్ బ్యాటింగ్ చేస్తున్నాడు.

ఓ బంతి బ్యాట్ అంచును తాకి కీపర్ ధోనీ చేతుల్లోకి వెళ్లింది. ధోనీ గట్టిగా అప్పీల్ చేశాడు. అంపైర్ నందన్ కన్విన్స్ కాలేదు. వెంటనే ధోనీ రివ్యూ కోసం అంపైర్‌కు సైగ చేశాడు. బౌలింగ్ టీమ్.. అంపైర్ నిర్ణయంపై సమీక్ష కోసం కెప్టెన్ అప్పీల్ చేయాల్సి ఉంటుంది.

కానీ వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత తొలి మ్యాచ్ ఆడుతున్న ధోనీ తన పాత అలవాటును మరిచిపోలేదు. ఆ తర్వాత కెప్టెన్ కోహ్లీ రివ్యూ కోసం అడిగాడు. మోర్గాన్ అవుట్ అని తేలింది.

1st ODI: India win toss, elect to bowl first againstEngland at Pune

భారత్ బ్యాటింగ్

- ఆ తర్వాత అశ్విన్ - హార్దిక్ పాండ్యాలు గెలుపు తంతు ముగించారు. భారత్ 48.1 ఓవర్లో 356 పరుగులు చేసి విజయం సాధించింది.

- 318 పరుగుల వద్ద జడెజా రూపంలో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది.

- కేదార్ జాదవ్ 120 పరుగులు (76b 12x4 4x6) చేసి ఆరో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. బాల్ బౌలింగులో స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

- కేదార్ జాదవ్ సెంచరీ చేశాడు. 65 బంతుల్లో సెంచరీ చేశాడు. ఫోర్ కొట్టి శతకం బాదాడు.

- స్టోక్స్ బౌలింగులో విల్లే క్యాచ్ పట్టగా కోహ్లీ అవుటయ్యాడు. కోహ్లీ 105 బంతుల్లో 122 పరుగులు (105b 8x4 5x6) చేసి అవుటయ్యాడు.

- ఈ క్రమంలో కోహ్లీ 93 బంతుల్లో సెంచరీ చేశాడు. 89 బంతుల్లో 99 పరుగులు చేసిన కోహ్లీ.. ఆ తర్వాత మూడు బంతుల్లో పరుగులు చేయలేదు. కానీ 93వ బంతికి సిక్స్ కొట్టి సెంచరీ దాటాడు. కోహ్లీ వన్డే కెరీర్లో ఇది 27వ సెంచరీ. కాగా, ల‌క్ష్య ఛేద‌న‌లో 17 సెంచ‌రీలు చేసి ఇప్పటివరకు స‌చిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఈ రికార్డును కోహ్లీ స‌మం చేశాడు.

- 63 పరుగులకే నాలుగు వికెట్లు పోయిన దశలో కోహ్లీ - కేదార్ జాదవ్‌లు దూకుడైన ఆటతో ఆకట్టుకున్నారు. ఓ వైపు కోహ్లీ ఆచితూచి ఆడుతూ పరుగులు తీస్తుండగా, జాదవ్ వేగంగా పరుగులు చేశాడు.

- నాలుగు వికెట్లు పోయిన తర్వాత భారత్ నిలకడగా ఆడుతోంది. కోహ్లీ - కేదార్ జాదవ్ చూసుకుంటూనే దూకుడుగా ఆడుతున్నారు. కేదార్ జాదవ్ దూకుడైన ఆట ఆడుతున్నాడు.

- 63 పరుగుల వద్ద ఎంఎస్ ధోనీ (6 బంతుల్లో 6 పరుగులు) అవుటయ్యాడు. బాల్ బౌలింగులో విల్లీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

- జట్టు స్కోరు 56 ఉన్నప్పుడు యువరాజ్ సింగ్ మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. 12 బంతుల్లో 15 పరుగులు చేశాడు. స్ట్రోక్స్ బౌలింగులో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

- 24 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ (18 బంతుల్లో 8 పరుగులు) రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. విల్లీ బౌలింగులో రాహుల్ అవుటయ్యాడు.

- భారత్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. జట్టు స్కోర్ 13 పరుగులు ఉన్నప్పుడు శిఖర్ ధావన్ ( 10 బంతుల్లో 1 పరుగు) అవుటయ్యాడు. విల్లీ బౌలింగులో అలీ క్యాచ్ పట్టడంతో ధావన్ అవుటయ్యాడు.

ఇంగ్లాండ్ బ్యాటింగ్

- ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 350 పరుగులు చేసింది. భారత్ ముందు 351 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

- 336 పరుగుల వద్ద మోయిన్ అలీ (28) వికెట్ కోల్పోయింది. ఉమేష్ యాదవ్ వికెట్ తీశాడు.

- 317 పరుగుల వద్ద ఇంగ్లాండ్ బెన్ స్టోక్స్ (62) రూపంలో ఆరో వికెట్ కోల్పోయింది. బూమ్రా బౌలింగులో ఉమేష్ క్యాచ్ పట్టాడు.

- జట్టు స్కోర్ 244 వద్ద ఉన్నప్పుడు రూట్ (78) అవుటయ్యాడు. బూమ్రా బౌలింగులో హార్దిక్ పాండ్యా క్యాచ్ పట్టాడు.

- జట్టు స్కోర్ 220 ఉన్నప్పుడు బట్లర్ (31) నాలుగో వికెట్‌గా అవుటయ్యాడు. పాండ్యా బౌలింగులో ధావన్ క్యాచ్ పట్టాడు.

- ఇంగ్లాండ్ జట్టు స్కోరు 157 పరుగుల వద్ద ఉన్నప్పుడు మోర్గాన్ అవుటయ్యాడు. హార్దిక్ పాండ్యా బౌలింగులో ధోనీ క్యాచ్ పట్టడంతో మూడో వికెట్ కోల్పోయింది.

- జట్టు స్కోర్ 104 వద్ద ఉన్నప్పుడు జాసన్ రాయ్ (73) అవుటయ్యాడు. జడెజా బౌలింగులో ధోనీ స్టంపౌట్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ రెండో వికెట్ కోల్పోయింది.

- జాసన్ రాయ్ అర్ధ సెంచరీ చేశాడు.

- 38 పరుగుల వద్ద ఇంగ్లాండ్ తొలి వికెట్ పడిపోయింది. హేల్స్ రనౌట్ అయ్యాడు.

భారత జట్టు: విరాట్ కోహ్లీ (సారథి), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), యువరాజ్ సింగ్, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడెజా, రవిచంద్రన్ అశ్విన్, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బూమ్రా

ఇంగ్లాండ్ జట్టు: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), జాసన్ రాయ్, అలెక్స్ హేల్స్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), మోయిన్ అలీ, క్రిస్ వోక్స్, అదిల్ రషీద్, డేవిడ్ విల్లీ, జేక్ బాల్.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+