For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆశ్చర్యం: సఫారీ గడ్డపై వన్డేల్లో కోహ్లీ ఒక్క సెంచరీ కూడా చేయలేదు

By Nageshwara Rao

హైదరాబాద్: మోడ్రన్ డే క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. గత కొన్నేళ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో 2017 సంవత్సారనికి గాను కోహ్లీ ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని కూడా సొంతం చేసుకున్నాడు.

ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు

ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు

దీంతో పాటు ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకి కూడా ఎంపికయ్యాడు. సఫారీ గడ్డపై విరాట్ కోహ్లీ మరో కొత్త ఛాలెంజ్‌కు సిద్ధమయ్యాడు. ఆరు వన్డేల సిరిస్‌లో భాగంగా డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికా జట్టుతో తొలి వన్డేలో కోహ్లీసేన తలపడనుంది. ఇప్పటివరకు సఫారీ గడ్డపై టీమిండియా ఒక్క ద్వైపాక్షిక సిరిస్‌ను కూడా గెలవలేదు.

 సిరిస్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కోహ్లీసేన

సిరిస్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కోహ్లీసేన

దీంతో కోహ్లీసేన ఈ సిరిస్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సఫారీ గడ్డపై ఇప్పటివరకు కోహ్లీ ఆడిన 11 మ్యాచ్‌ల్లో సెంచరీ చేయకపోవడం విశేషం. దీంతో ఈ ఆరు వన్డేల సిరిస్‌లో కోహ్లీ సెంచరీ కూడా నమోదు చేయాల్సి ఉంది. సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాతో 8 వన్డేలాడిన కోహ్లీ, మిగతా మూడు మ్యాచ్‌లను 2009లో జరిగిన ఛాంపియన్స్‌లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్, వెస్టిండిస్ జట్లపై ఆడాడు.

కోహ్లీ అత్యధిక స్కోరు 87 పరుగులు

కోహ్లీ అత్యధిక స్కోరు 87 పరుగులు

సఫారీ గడ్డపై వన్డేల్లో విరాట్ కోహ్లీ అత్యధిక స్కోరు 87 పరుగులు మాత్రమే. ఈ నేపథ్యంలో ఈ ఆరు వన్డేల సిరిస్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ నమోదు చేయాలని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు. తన క్రికెట్ కెరీర్‌లో వన్డేల్లో 32 సెంచరీలు సాధించిన కోహ్లీ ఇప్పటివరకు సఫారీ గడ్డపై సెంచరీని నమోదు చేయకపోవడం విశేషం.

టెస్టు క్రికెట్‌లో మాత్రం సెంచరీ

టెస్టు క్రికెట్‌లో మాత్రం సెంచరీ

వన్డే సిరిస్‌కు ముందు జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో విరాట్ కోహ్లీ (153) పరుగులతో సెంచరీని నమోదు చేశాడు. అయితే, వన్డేల్లో కూడా సఫారీ గడ్డపై కోహ్లీ తన బ్యాటింగ్ మాస్టర్ క్లాస్‌ను చూపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఫిబ్రవరి 16తో ముగియనున్న ఆరు వన్డేల సిరిస్‌లో కోహ్లీ ఒక్క సెంచరీ అయినా సాధించాలని ఆశిద్దాం.

 సఫారీ గడ్డపై విరాట్ కోహ్లీ గణాంకాలు ఇలా ఉన్నాయి.

సఫారీ గడ్డపై విరాట్ కోహ్లీ గణాంకాలు ఇలా ఉన్నాయి.

(8 matches, 224 runs, Highest - 87 not out, Average - 37.33)

* 54 - Durban (January 12, 2011)

* 22 - Johannesburg (January 15, 2011)

* 28 - Cape Town (January 18, 2011)

* 87 not out - Port Elizabeth (January 21, 2011)

* 2 - Centurion (January 23, 2011)

* 31 - Johannesburg (December 5, 2013)

* 0 - Durban (December 8, 2013)

Did not bat - Centurion (December 11, 2013)

Overall ODI numbers of Kohli vs South Africa

Played: 20, Runs: 711, Highest: 138, Hundreds: 1, Average: 44.43

Story first published: Thursday, February 1, 2018, 12:48 [IST]
Other articles published on Feb 1, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+