For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డర్బన్‌లో తొలి వన్డే: సఫారీలను ఎదుర్కొనే తుది జట్టు ఇదే

By Nageshwara Rao
1st ODI in Durban: Here is likely India Playing XI to face South Africa

హైదరాబాద్: సఫారీ గడ్డపై ఇటీవల ముగిసిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో తుది జట్టు ఎంపికపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, జట్టు మేనేజ్‌మెంట్ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తొలి టెస్టు టెస్టులకు రహానేను తప్పించడం, రెండో టెస్టుకు భువీని ఎంపిక చేయకపోవడం... మొదలైన కారణాల వల్లే తొలి రెండు టెస్టుల్లో కోహ్లీసేన ఓటమి పాలైందని అటు అభిమానులతో పాటు ఇటు క్రికెట్ విశ్లేషకులు విమర్శల వర్షం కురిపించారు.

ఇప్పుడు టెస్టు సిరిస్ ముగిసింది. గురువారం (ఫిబ్రవరి 1) నుంచి భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య డర్బన్ వేదికగా తొలి వన్డే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తుది జట్టు ఎంపిక ఎలా ఉంటుందోనని క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకుల్లో దక్షిణాఫ్రికా అగ్రస్ధానంలో కొనసాగుతుండగా, భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆరు వన్డేల సిరిస్‌ను 4-2తో కోహ్లీసేన సొంతం చేసుకుంటే వన్డేల్లో టీమిండియా అగ్రస్థానానికి చేరుకుంటుంది.

అదే సిరిస్ 3-3తో డ్రా అయితే మాత్రం సఫారీలదే నెంబర్ వన్ ర్యాంకు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 1-2తో కోహ్లీసేన చేజార్చుకున్న నేపథ్యంలో వన్డే సిరిస్‌నైనా గెలవాలనే పట్టుదలతో భారత క్రికెటర్లు ఉన్నారు. అయితే, ఇప్పటివరకు టీమిండియా సఫారీ గడ్డపై ద్వైపాక్షిక సిరిస్‌ను గెలవకపోవడం విశేషం. తొలి వన్డే నేపథ్యంలో బుధవారం (జనవరి 31)న కెప్టెన్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ రవిశాస్త్రితో కలిసి తుది జట్టుని ఎంపిక చేయనున్నారు.

అంతకముందు స్వదేశంలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరిస్‌కు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పెళ్లి కారణంగా తప్పుకోవడంతో అతడి స్థానంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలను తీసుకున్న సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా శ్రీలంకతో జరిగిన వన్డే, టీ20 సిరిస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సఫారీ పర్యటనలో రోహిత్ శర్మ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు.

తొలి వన్డే నేపథ్యంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సఫారీ గడ్డపై వన్డే సిరిస్ ఐసీసీ వరల్డ్ కప్‌కు సన్నాహాకంగా ఉంటుందని పేర్కొన్నాడు. కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఆరు వన్డేల సిరిస్‌లో దక్షిణాఫ్రికాను ఓడిస్తే అది చరిత్ర అవుతుంది. ఎందుకంటే సఫారీ గడ్డపై టీమిండియా ఇప్పటివరకు ఒక్క వన్డే సిరిస్‌ను కూడా గెలవలేదు.


Here is India's likely XI for 1st ODI (Day/Night) against South Africa:

1. Rohit Sharma (vice-captain)
2. Shikhar Dhawan
3. Virat Kohli (captain)
4. Dinesh Karthik
5. Shreyas Iyer
6. MS Dhoni (wicketkeeper)
7. Hardik Pandya
8. Bhuvneshwar Kumar
9. Jasprit Bumrah
10. Mohammed Shami
11. Yuzvendra Chahal


India squad: Virat Kohli (captain), Rohit Sharma (vice-captain), Shikhar Dhawan, Ajinkya Rahane, Shreyas Iyer, Manish Pandey, Kedar Jadhav, Dinesh Karthik (wicketkeeper), MS Dhoni (wicketkeeper), Hardik Pandya, Axar Patel, Kuldeep Yadav, Yuzvendra Chahal, Bhuvneshwar Kumar, Jasprit Bumrah, Mohammed Shami, Shardul Thakur.


South Africa squad: Faf du Plessis (captain), Hashim Amla, Quinton de Kock (wicketkeeper), JP Duminy, Imran Tahir, Aiden Markram, David Miller, Morne Morkel, Chris Morris, Lungi Ngidi, Andile Phehlukwayo, Kagiso Rabada, Tabraiz Shamsi, Khaya Zondo.

Match starts at 4.30 PM IST (1 PM Local, 11 AM GMT)

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, February 1, 2018, 9:54 [IST]
Other articles published on Feb 1, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+