టీ20ల్లో డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన కేవీ హరికృష్ణన్

హైదరాబాద్: వన్డేల్లో డబుల్ సెంచరీ గొప్ప అని అనుకుంటున్న రోజుల్లో తాజాగా ఓ కుర్రాడు టీ20ల్లో సైతం డబుల్ సెంచరీ సాధించి ఔరా అనిపించాడు. దుబాయ్ వేదికగా క్లబ్ క్రికెట్ ఆధ్వర్యంలో జరిగిన అలియన్స్ టీ20 లీగ్‌లో ఈ సంచలన రికార్డు నమోదైంది. భారత్‌కు చెందిన 19 ఏళ్ల కేవీ హరికృష్ణన్ ఈ సంచలన ఇన్నింగ్స్‌ను నమోదు చేశాడు.
ఈ మ్యాచ్‌లో స్పోర్టింగ్ క్రికెట్ క్లబ్ తరపున బరిలోకి దిగిన కేవీ హరికృష్ణన్ 78 బంతుల్లో 22 ఫోర్లు, 14 సిక్సర్ల సాయంతో 208 పరుగులతో నాటౌట్‌గా నిలిచి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆరంభం నుంచే బౌండరీలతో విరుచుకుపడ్డ హరికృష్ణన్.. తన ఇన్నింగ్స్‌లో ఏకంగా 22 ఫోర్లు, 14 సిక్సర్లు బాదాడు.

36 బంతుల్లో కేవలం బౌండరీల ద్వారానే 172 పరుగులు
ఇందులో 36 బంతుల్లో కేవలం బౌండరీల ద్వారానే 172 పరుగులు రాబట్టాడు. హరికృష్ణ భారీ ఇన్నింగ్స్‌తో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. దీంతో మెకోస్ క్రికెట్ క్లబ్‌కు 251 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన ప్రత్యర్థి జట్టు 17 ఓవర్లలోనే ఛేదించి విజయం సాధించడం విశేషం.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న హరికృష్ణన్
ఆషిర్ (82 నాటౌట్), రవూఫ్ (43 నాటౌట్) రాణించారు. అయితే, స్పోర్టింగ్ క్రికెట్ క్లబ్ జట్టు ఓడినప్పటికీ హరికృష్ణన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' లభించడం విశేషం. రెండేళ్ల క్రితం షార్జా వేదికగా జరిగిన యూనివర్సిటీ ప్రీమియర్ లీగ్‌లో 33 బంతుల్లోనే సెంచరీ కొట్టి వెలుగులోకి వచ్చిన హరికృష్ణన్.. ప్రస్తుతం యూఏఈ అండర్-19 జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

మ్యాచ్ అనంతరం హరికృష్ణన్ మాట్లాడుతూ
మ్యాచ్ అనంతరం హరికృష్ణన్ మాట్లాడుతూ "టీ20ల్లో డబుల్ సెంచరీ సాధించినప్పటికీ తన లక్ష్యం మాత్రం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), ఇతర టీ20 లీగ్‌ల్లో ఆడటమేనని అన్నాడు. భారీ షాట్లతో పరుగుల చేయడాన్ని తానెప్పుడు ఆస్వాదిస్తానని, గతంలో 36 బంతుల్లోనే సెంచరీ చేసిన అనుభవం ఉంది" అని అన్నాడు.

వెంకటేశ్ ప్రసాద్ సూచనలు సైతం
ఆప్ఘన్ ప్రీమియర్ లీగ్ ఆడిన హరికృష్ణన్, అక్కడ అంతర్జాతీయ క్రికెటర్ల శిక్షణతో రాటుదేలాడు. అలాగే భారత క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ సూచనలు తీసుకున్నాడు. ఇదిలా ఉంటే అంతర్జాతీయ టీ20ల్లోనూ ఇప్పటి వరకు డబుల్ సెంచరీ నమోదు కాలేదు. ఐపీఎల్-2013లో వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్ సాధించిన 175 (నాటౌట్) పరుగులే ఇప్పటి వరకు అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications