న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గంగూలీ, ధోనీ, కోహ్లీల కెరీర్‌లో 183 కామన్..??

 183 Is Common Between Virat Kohli, MS Dhoni & Sourav Ganguly

హైదరాబాద్: గంగూలీ, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీల క్రికెట్ కెరీర్‌లో చాలా విషయాల్లో సామీప్యత ఉంటుంది. ధోనీ, గంగూలీ ఒకప్పటి టీమిండియా కెప్టెన్లు దాంతో పాటు కోహ్లీ కూడా భారత జట్టు ప్రస్తుత కెప్టెనే.. అంతేకాదు పదేళ్ల క్రితం క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న గంగూలీ.. అప్పట్లో కెప్టెన్సీలో వ్యవహరించిన తీరు కోహ్లీకి దగ్గర పోలిక ఉంటుంది. టెస్టు, వన్డే, టీ 20 మూడు ఫార్మాట్లలో విజయవంతంగా రాణించే ఈ ముగ్గురు దిగ్గజాల అత్యధిక స్కోర్లు ఒకటే కావడం గమనార్హం.

గంగూలీ శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బాదుడు:

గంగూలీ శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బాదుడు:

1999వ సంవత్సరం వన్డే ప్రపంచ కప్ జరుగుతున్న సమయంలో.. గంగూలీ శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో వీర బాదుడు బాది 183 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ఈ ప్రపంచ కప్‌లో భారత్ గెలవలేకపోయనప్పటికీ ఈ స్కోరు భారత్‌ను ప్రపంచ కప్ టోర్నీ నుంచి వెంటనే వైదొలగకుండా కాపాడింది.

ధోనీ కూడా అదే శ్రీలంకపైనే 2005లో:

ధోనీ కూడా అదే శ్రీలంకపైనే 2005లో:

గంగూలీతో పాటు ధనాదన్ ధోనీ కూడా అదే శ్రీలంకపైనే 2005వ సంవత్సరంలో అంతే స్కోరును నమోదు చేశాడు. 300 టార్గెట్ నమోదు చేసిన శ్రీలంకపై చేధనకు దిగిన టీమిండియా ధోనీ ఇన్నింగ్స్‌తో లంకను సునాయాసంగా ఎదుర్కొంది. ఆరు వికెట్ల తేడాతో విజయం పొందింది. ఈ విజయంతో ఏడు మ్యాచ్‌ల సిరీస్‌లో 7-0తో ఆధిక్యం పొందింది. ఆ తర్వాత సిరీస్ మొత్తానికి 6-1 తో విజయం సాధించింది.

వీరి రికార్డుకు కోహ్లీ 2012లో:

వీరి రికార్డుకు కోహ్లీ 2012లో:

వీరిద్దరి రికార్డుకు కోహ్లీ 2012లో చేరుకున్నాడు. ఆసియా కప్ టోర్నీలో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ తానొక్కడే 183పరుగులు నమోదు చేశాడు. విరాట్ ప్రతాపానికి ఫైనల్ చేరుకునేందుకు ఆశలు సజీవంగా మిగిలాయి.

స్టార్ క్రికెటర్లుగా మారకముందే:

స్టార్ క్రికెటర్లుగా మారకముందే:

ఇంకో విషయం ఏమంటే వీరు ముగ్గురు స్టార్ క్రికెటర్లుగా మారకముందే ఇంత స్కోరు నమోదు చేయడం విశేషం. దీంతో పాటు గంగూలీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ధోనీ స్కోరును నమోదు చేస్తే.. ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు కోహ్లీ ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు.

Story first published: Monday, June 18, 2018, 18:35 [IST]
Other articles published on Jun 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X