రాజ్‌కోట్ టెస్టులో పృథ్వీషా రికార్డుల మోత (వీడియో)

హైదరాబాద్: రాజ్‌కోట్ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగి రెండో అతి పిన్న వయస్కుడిగా ఘనత సాధించిన పృథ్వీషా, తన అరంగేట్రం మ్యాచ్‌లోనే అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది.
అనంతరం ఓపెనర్‌గా క్రీజులోకి దిగిన పృథ్వీ షా 55 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా భారత్ తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ సాధించిన పిన్నవయస‍్కుడిగా పృథ్వీ షా అరుదైన చరిత్ర సృష్టించాడు.
ఈ క్రమంలో పృథ్వీ షా 59 ఏళ్ల రికార్డుని బద్దలు కొట్టాడు. ఈ రికార్డు నమోదు చేసేనాటికి పృథ్వీ షా వయసు 18 ఏళ్ల 329 రోజులు. గతంలో అబ్బాస్ అలీ బెయిగ్ (20 ఏళ్ల 126 రోజులు) పేరిట ఈ రికార్డు ఉండగా ఇప్పుడు దానిని పృథ్వీ షా అధిగమించాడు.
అరంగేట్రం మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ బాదిన పృథ్వీషా
1959లో మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో అబ్బాస్ అలీ బెయిగ్(20 ఏళ్ల 126 రోజులు) అరంగేట్రం మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో అరంగేట్రం మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన పిన్న వయస్కుడి తన పేరిట రికార్డుని నెలకొల్పాడు. పృథ్వీ షా 18 ఏళ్ల 329 రోజుల వయసులోనే ఈ ఘనత సాధించాడు.
భారత ఆటగాళ్ల జాబితాలో షా మూడో స్థానంలో
పిన్న వయసులో తొలి టెస్టు హాఫ్ సెంచరీ చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో పృథ్వీ షా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్(16 ఏళ్ల 214 రోజులు) తొలి స్థానంలో ఉండగా, పార్థీవ్ పటేల్(18 ఏళ్ల 301 రోజులు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక, ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి( 19 ఏళ్ల 215 రోజులు) నాలుగో స్థానంలో, దినేశ్ కార్తీర్(19 ఏళ్ల 291 రోజులు) ఐదో స్థానంలో ఉన్నారు.
ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో జట్టులో చోటు
వెస్టిండిస్‌తో ప్రస్తుతం జరుగుతున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో పృథ్వీ షా చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, భారత్ తరుపున టెస్టు ఆడుతున్న 293 వ ఆటగాడిగా గుర్తింపు పొందిన పృథ్వీ.. మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో టీమిండియా ఓపెనర్‌గా బరిలోకి దిగిన రెండో అతి చిన్న వయస్కుడి(18 ఏళ్ల 329 రోజులు)గా అరుదైన ఘనత సాధించాడు.
వంద పరుగులు చేసిన యువ క్రికెటర్‌గా రికార్డు
ఇక ఈ జాబితాలో విజయ్ మెహ్రా (17 ఏళ్ల 265రోజులు) తొలి స్థానంలో ఉన్నాడు. 14 ఏళ్లకే ముంబై డివిజన్ కంగా లీగ్‌లో వంద పరుగులు చేసిన యువ క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. డిసెంబరు 2014న స్కూలు తరపున 546పరుగులు చేసి రికార్డుల్లో నిలిచిపోయాడు. ప్రతిభను గుర్తించిన ముంబై క్రికెట్ అసోసియేషన్ అతణ్ని ముంబై అండర్ 16జట్టుకు కెప్టెన్‌గా నియమించింది.
అండర్-19 వరల్డ్‌కప్‌ను గెలుచుకున్న టీమిండియాకు కెప్టెన్‌గా
ఆ తర్వాత అరంగ్రేట మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన రికార్డును రెండు దశాబ్దాలుగా ఎవరూ సాధించలేని పరుగులు చేయగలిగాడు. న్యూజిలాండ్ వేదికగా అండర్-19 వరల్డ్‌కప్‌ను గెలుచుకున్న టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఐపీఎల్ 2018లో ఆడని షా ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టులో 245 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఇంగ్లాండ్ పర్యటన చేసిన భారత్ ఏ జట్టులో 603పరుగులు చేసి 60.3 సగటుతో విజృంభించి ఆడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications