Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రెయిగ్ రికార్డు బద్దలు: ఆస్ట్రేలియా గడ్డపై పాక్ పేసర్ అరుదైన ఘనత

16 years and 279 days old Naseem Shah becomes youngest Test cricketer to debut in Australia

హైదరాబాద్: పాకిస్థాన్ యువ పేసర్ నసీమ్ షా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్రేలియా బ్రిస్బేన్‌ వేదికగా గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో నసీమ్‌ షా టెస్టు అరంగేట్రం చేశాడు. ఫలితంగా ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో అరంగేట్రం చేసిన పిన్న వయస్కుడిగా నసీమ్ షా నిలిచాడు. మొత్తంగా టెస్టుల్లో అరంగేట్రం చేసిన తొమ్మిదవ పిన్న వయస్కుడిగా నిలిచాడు.

ప్రస్తుతం నసీమ్ షా వయసు 16 ఏళ్ల, 279 రోజులు. దీంతో ఆసీస్ మాజీ కెప్టెన్ ఇయాన్ క్రెయిగ్ పేరిట ఉన్న రికార్డుని బద్దలు కొట్టాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ ఇయాన్ క్రెయిగ్ పేరిట ఉంది. 1953లో ఇయాన్‌ క్రెయిగ్‌ దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో 17 ఏళ్ల వయసులో అరంగేట్రం చేశాడు.

ఆసీస్ గడ్డపై అరంగేట్రం రికార్డు

ఇప్పుడు ఆ రికార్డుని నసీమ్ షా బద్దలు కొట్టాడు. అంతేకాదు ఆరు దశాబ్లాత తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై పిన్న వయసులో టెస్టు అరంగేట్రం చేసిన రికార్డుని నసీమ్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆప్ఘనిస్థాన్‌ బోర్డర్‌లోని దిర్ జిల్లాకు చెందిన నసీమ్ షా ఇప్పటివరకు పాక్ తరుపున ఏడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 27 వికెట్లు పడగొట్టాడు.

నసీమ్ షావైపే మొగ్గు చూపిన జట్టు మేనేజ్‌మెంట్

నసీమ్ షావైపే మొగ్గు చూపిన జట్టు మేనేజ్‌మెంట్

గురువారం అడిలైడ్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులో పేస్ బౌలింగ్ స్లాట్ కోసం ముగ్గురు టీనేజర్లు ముహమ్మద్ ముసా, షాహిన్ అఫ్రిది, నసీమ్ షా పోటీ పడ్డారు. అయితే, జట్టు మేనేజ్‌మెంట్ నసీమ్ షావైపే మొగ్గు చూపింది. దీంతో తొలి టెస్టులో సీనియర్ పేసర్లు ముహమ్మద్ అబ్బాస్, ఇమ్రాన్ ఖాన్‌లతో నసీమ్ బంతిని పంచుకున్నాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 240 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాట్స్‌మెన్లలో అసాద్‌ షఫీక్‌(76) హాఫ్ సెంచరీతో రాణించగా కెప్టెన్‌ అజహర్‌ అలీ(39), మహ్మద్‌ రిజ్వాన్‌(37)లు ఫర్వాలేదనిపించారు.

నాలుగు వికెట్లు తీసిన స్టార్క్

ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా, ప్యాట్‌ కమిన్స్‌ మూడు, హజల్‌వుడ్‌కు రెండు, నాథన్‌ లియన్‌కు ఒక వికెట్ లభించింది. పాకిస్థాన్ ఆలౌట్ కాగానే తొలి రోజు ఆట ముగిసింది.

Story first published: Thursday, November 21, 2019, 15:02 [IST]
Other articles published on Nov 21, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+