For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మీసాలు కూడా మొలవలేదు కదరా భయ్ - టీ20 ప్రపంచకప్‌లో అరంగేట్రం

16-year-old UAE cricketer Aayan Khan creates record as Youngest player in T20 World Cup 2022.

మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో రెండో మ్యాచ్ ఆరంభమైంది. మెల్‌బోర్న్ గీలాంగ్ స్టేడియంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్-నెదర్లాండ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది యూఏఈ. ఫర్వాలేదనిపించేలా బ్యాటింగ్ సాగుతోంది. అయిదు ఓవర్లల్లో 26 పరుగులు చేశారు. ఓపెనర్లు చిరాగ్ సూరి - 7, ముహమ్మద్ వసీం -15 పరుగులుతో ఆడుతున్నారు. నెదర్లాండ్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులను సంధిస్తోన్నారు.

తొలి మ్యాచ్‌లో నమీబియా చేతిలో శ్రీంక జట్టు ఘోరంగా ఓటమిపాలైన విషయం తెలిసిిందే. శ్రీలంకకు షాకిచ్చింది నమీబియా. తొలుత బ్యాటింగ్‌లో, ఆ తరువాత బౌలింగ్‌లో అంచనాలకు అందని విధంగా రాణించింది. ఆసియా కప్ 2022 విన్నర్‌ శ్రీలంకను చిత్తు చేసింది. సూపర్ 12లో ప్రవేశించడానికి తన అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. ఈ ఊహించని పరాజయంతో శ్రీలంక ప్రస్థానం ప్రమాదంలో పడినట్టే కనిపిస్తోంది.

యూఏఈ జట్టు ప్లేయర్ ఆయాన్ ఖాన్ ఓ సరికొత్త రికార్డు సృష్టించాడు. యంగెస్ట్ ప్లేయర్‌గా నిలిచాడు. అతని వయస్సు 16 సంవత్సరాలే. 2005 నవంబర్ 15వ తేదీన జన్మించాడతను. కుిడిచేతి వాటం గల బ్యాటర్. స్లో లెఫ్ట్ ఆర్మ ఆర్థొడాక్స్ బౌలర్. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం పెద్దగా లేదు. మూడు టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. 25 పరుగులు చేశాడు. మూడు వికెట్లు పడగొట్టాడు. అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్ 2/33.

ఆల్‌రౌండర్ కోటాలో అతన్ని జట్టులోకి తీసుకుంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ టీమ్ మేనేజ్‌మెంట్. ఈ ఏడాది సెప్టెంబర్‌ 25వ తేదీన బంగ్లాదేశ్‌తో దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. ఇంత చిన్న వయస్సులో టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌ ఆడిన ప్లేయర్ మరొకరు లేరు. దీనితో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకొన్నాడీ యంగెస్ట్ ప్లేయర్. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఆడే ఒత్తిడిపై తనపై లేదని వ్యాఖ్యానించాడు. క్రికెట్ ప్రపంచానికి తన సత్తాను చాటడానికి చక్కని వేదికగా అభివర్ణించాడు.

Story first published: Sunday, October 16, 2022, 14:18 [IST]
Other articles published on Oct 16, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+