హైదరాబాద్: శ్రీలంకతో జరగబోయే మూడు టెస్టుల సిరిస్‌కు 16 మంది సభ్యుల భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. సీనియర్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేశాడు. ఫామ్‌లో లేని కరుణ్ నాయర్ స్థానంలో రోహిత్ శర్మ జట్టులోకి వచ్చాడు.
భుజం శస్త్ర చికిత్స నుంచి కోలుకున్న ఓపెనర్ లోకేష్ రాహుల్ కూడా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆస్ట్రేలియాతో ధర్మశాలలో జరిగిన టెస్టు మ్యాచ్ ఆడిన 15 మంది జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. జులై 26 నుంచి సెప్టెంబర్ 6 వరకు శ్రీలంకలో టీమిండియా పర్యటించనుంది.

ఈ పర్యటనలో భాగంగా మొత్తం 3 టెస్టులు, 5 వన్డేలతో పాటు ఒక టీ20 మ్యాచ్‌ను ఆడనుంది. ఈ సిరిస్‌కు 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును జాతీయ సెలెక్టర్లు ఆదివారం ప్రకటించారు.
లంక పర్యటనకు భారత జట్టు:
విరాట్ కోహ్లి(కెప్టెన్), మురళీ విజయ్, కేఎల్ రాహుల్, చతేశ్వర పుజారా, అజింక్య రహానె (వైఎస్ కెప్టెన్), రోహిత్ శర్మ, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్‌కుమార్, మహ్మద్ షమీ, కుల్‌దీప్ యాదవ్, అభినవ్ ముకుంద్