ఎంత పెద్ద తప్పు చేశాడో ఫ్లింటాఫ్‌కు తర్వాత అర్థమైంది
2007 సెప్టెంబర్ 19వ తేదీన.. మొదటి టీ20 ప్రపంచకప్‌లో భాగంగా డర్బన్ వేదికగా ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్‌లో జరిగిన ఘట్టమిది. ఆ మ్యాచ్ ఇండియా తప్పక గెలవాల్సిన పరిస్థితి. తొలుత భారత్ బ్యాటింగ్ చేసింది. క్రీజులో యువీ ధోనీ ఉన్నారు. అప్పటికి టీమిండియా స్కోర్ మూడు వికెట్లకు 171. మరో రెండు ఓవర్లు మిగిలి ఉన్నాయి. అనవసరంగా అంతకుముందు అండ్రూ ఫ్లింటాఫ్ యువీని ఏదో అన్నాడు. ఆ తర్వాత తానెంత పెద్ద తప్పు చేశాననే విషయం ఫ్లింటాఫ్‌కు అర్థమవుతుంది.
బంతి ఎటు వేసినా.. గుంజికొడితే స్టాండ్స్‌లోకే
ఇన్నింగ్స్ 19వ ఓవర్‌ని స్టువర్ట్ బ్రాడ్ వేశాడు. మొదటి బాల్‌కు తన సొగసైన టచ్‌తో యువీ సిక్స్ కొట్టాడు. ఇక రెండో బంతి నుంచి బాల్ ఎలా వేసినా, ఏ దిక్కు వేసినా యువీ బ్యాట్ నుంచి సిక్సర్ మాత్రమే బదులుగా వచ్చింది. యువీ సిక్సర్ల దెబ్బకు స్టేడియం హోరెత్తింది. ఫ్లిక్ సిక్సెస్, టచ్ సిక్సెస్, హిట్ సిక్సెస్ ఇలా అన్నీ వేరియేషన్లలో యువీ బాదిన సిక్సులు నా భూతో నా భవిష్యత్తు. టీ20 క్రికెట్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన తొలి ప్లేయర్‌గా చిరస్మరణీయ రికార్డును యువీ సొంతం చేసుకున్నాడు. అలాగే కేవలం 12బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ఔరా అనిపించాడు. యువీ దెబ్బకి 171గా ఉన్న స్కోరు ఆరు బంతుల తర్వాత 207కు చేరింది. రవిశాస్త్రి కామెంట్రీ కూడా ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది.
కొడుకు ఓరియన్‌తో కలిసి మురిసిపోతూ
ఇకపోతే నేటితో ఆ ఘట్టాకి 15ఏళ్లు నిండగా.. యువరాజ్ సింగ్ తన ఆరు సిక్సర్ల 15వ వార్షికోత్సవాన్ని కొడుకు ఓరియన్‌తో కలిసి జరుపుకున్నాడు. ఆ ఇన్నింగ్స్ చూడ్డానికి తనకు ఇంతకంటే మంచి పార్ట్‌నర్ దొరకడని ట్వీట్లో పేర్కొన్నాడు. కొడుకుతో కలిసి టీవీలో ఆరు సిక్సర్లను చూస్తూ మురిసిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరలవుతోంది. ఇక ఆ మ్యాచ్‌లో భారత్ 20ఓవర్లు ముగిసేసరికి 4వికెట్లు కోల్పోయి 218పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ ఛేదనలో పోరాడినా చివర్లో చేతులెత్తేసింది. ఇక 2011లో భారత్ వరల్డ్ కప్ కూడా గెలిచింది. అంతకుముందు గ్యారీ సోబర్స్, రవిశాస్త్రి గతంలో ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో ఒకే ఓవర్లో ఆరు సిక్సులు కొట్టిన ఫీట్ సాధించగా.. అంతర్జాతీయ క్రికెట్లో హర్షల్ గిబ్స్ ఈ రికార్డ్ సాధించాడు. ఇక యువీ సిక్స్ సిక్సర్ల ప్లేస్ మెంట్స్ ఓసారి గమనిస్తే.. తొలి సిక్స్ కౌ కార్నర్ మీదుగా, రెండో సిక్స్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా, మూడో బంతిని ఎక్స్‌ట్రా కవర్ మీదుగా, నాలుగో సిక్స్ బ్యాక్‌వర్డ్ పాయింట్ మీదుగా, ఐదోది మిడ్‌వికెట్ మీదుగా, ఆరోది మిడ్-ఆన్ మీదుగా బాదాడు.


Click it and Unblock the Notifications












