Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ! (వీడియో)

క్రికెట్ పట్ల వైభవ్ సూర్యవంశీకి ఉన్న కసి, పట్టుదల చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ సూర్యవంశీ కేవలం 14 బంతుల్లోనే 39 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 280 స్ట్రైక్ రేట్‌తో, ప్రపంచ అత్యుత్తమ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్‌లను చీల్చి చెండాడిన ఈ యువ సంచలనం.. ఔటయ్యాక పెవిలియన్‌కు వెళ్తూ కన్నీళ్లు పెట్టుకోవడం ఇప్పుడు నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.

బుమ్రాను బాదినా.. ఇంకా కావాలనుకున్నాడు!
వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఆరంభం నుంచే విధ్వంసం సృష్టించాడు. బుమ్రా వేసిన తొలి బంతినే సిక్సర్‌గా మలిచి.. మొత్తం 5 సిక్సర్లతో ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. అయితే ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటైన తర్వాత.. వైభవ్ సూర్యవంశీ ముఖంలో చిరునవ్వుకు బదులు తీవ్రమైన నిరాశ కనిపించింది. డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లేటప్పుడు తన కళ్లలో నీళ్లు తిరగడం కెమెరాకు చిక్కింది. 14 బంతుల్లో 39 పరుగులు అనేది అంత చిన్న వయసులో గొప్ప స్కోరు అయినప్పటికీ.. వైభవ్ జట్టు కోసం మరిన్ని పరుగులు చేయలేకపోయానని బాధపడటం అతడిలోని క్రీడాస్ఫూర్తికి అద్ధం పడుతోంది.

15-Year-Old Vaibhav Suryavanshi Tears Up After Getting Out in RR vs MI Heartbreaking Moment Video Viral

చిన్న పిల్లాడే కదా.. ఆ ఎమోషన్ స్పెషల్!
సోషల్ మీడియాలో ఈ దృశ్యాన్ని చూసిన క్రికెట్ అభిమానులు వైభవ్‌ సూర్యవంశీని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. "వైభవ్ ఇంకా చిన్న పిల్లాడే.. ఆ ఎమోషనే అతన్ని ప్రత్యేకంగా మారుస్తోంది" అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. బుమ్రా లాంటి దిగ్గజ బౌలర్‌ను ఎదుర్కొని అంత స్కోరు చేసినా సంతృప్తి చెందకపోవడం, వైభవ్ క్రికెట్ పట్ల ఎంత అంకితభావంతో ఉన్నాడో చూపిస్తోంది. పరుగుల ఆకలి ఉన్న ఇలాంటి ఆటగాడే టీమిండియాకు కాబోయే స్టార్ అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ధీమా వ్యక్తం చేస్తున్నారు.

వైభవ్ ఎమోషనల్ పోస్ట్
మరోవైపు ముంబై ఇండియన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం సాధించిన అనంతరం ఆ మ్యాచ్‌లో మెరుపులు మెరిపించిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ 2026లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ బీహార్ కుర్రాడు, తన ప్రదర్శన పట్ల అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపాడు. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మ్యాచ్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ, "సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు" అంటూ కేవలం నాలుగు ముక్కల్లో తన మనసులోని మాటను తెలియజేశాడు.

స్టార్ల ప్రశంసలు
వైభవ్ కన్నీళ్లు పెట్టుకోవడం చూసి మాజీ క్రికెటర్లు కూడా స్పందించారు. "అతనిలోని ఆ బాధే అతన్ని గొప్ప ఆటగాడిగా తీర్చిదిద్దుతుంది. తక్కువ స్కోరుకే సంతృప్తి చెందే గుణం అతనిలో లేదు" అని కొనియాడారు. రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం కూడా వైభవ్‌ను ఓదార్చుతూ, అతను చేసిన ఇన్నింగ్స్ జట్టు విజయంలో ఎంత కీలకమో గుర్తుచేశారు. ఏదేమైనా ఓ 15 ఏళ్ల బాలుడు ప్రపంచ మేటి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించి, ఇంకా చేయలేకపోయాననే ఆవేదనతో కన్నీరు కార్చడం క్రికెట్ చరిత్రలో ఓ అరుదైన, భావోద్వేగపూరితమైన సన్నివేశంగా నిలిచిపోతుంది.

Story first published: Wednesday, April 8, 2026, 10:16 [IST]
Other articles published on Apr 8, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+