Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆర్చర్‌కు చుక్కలు చూపించిన బుడ్డోడు! (వీడియో)

ఐపీఎల్ 2026 సీజన్లో ప్రస్తుతం క్రికెట్ అభిమానులందరి నోటో వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులోనే దిగ్గజ బౌలర్లను తన బ్యాటింగ్ పవర్‌తో భయపెడుతున్న ఈ రాజస్థాన్ రాయల్స్ 'వండర్ బాయ్' నేడు గుజరాత్ టైటాన్స్‌తో జరగబోయే కీలక పోరుకు ముందు నెట్స్‌లో బీభత్సం సృష్టించాడు. వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ శైలి చూస్తుంటే.. అప్పుడే అంతర్జాతీయ స్థాయి అనుభవం ఉన్న ఆటగాడిలా కనిపిస్తున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రాక్టీస్‌లో ఆర్చర్‌పై విరుచుకుపడ్డ వైభవ్ సూర్యవంశీ
రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ 46 సెకన్ల వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో ఇంగ్లాండ్ స్టార్ పేసర్ ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకరైన జోఫ్రా ఆర్చర్ వేస్తున్న నిప్పులు చెరిగే బంతులను వైభవ్ ఏమాత్రం తడబడకుండా ఎదుర్కోవడం విశేషం. సాధారణంగా జోఫ్రా ఆర్చర్ వేగానికి దిగ్గజ బ్యాటర్లే డిఫెన్స్‌లో పడతారు. కానీ వైభవ్ సూర్యవంశీ మాత్రం క్రీజులో నిలబడి భారీ సిక్సర్లు, క్లాసీ ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఈ వీడియో చూసిన అభిమానులు.. జోఫ్రా ఆర్చర్‌నే వదలని ఈ కుర్రాడిని ఆపడం ఎవరి తరమని చర్చించుకుంటున్నారు.

15-Year-Old Vaibhav Suryavanshi Smashes Jofra Archer in Nets Rajasthan Royals Wonder Boy Viral Video

సీఎస్కేపై సృష్టించిన సునామీ
ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే సీఎస్కే బౌలర్లపై వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో 305.88 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో కేవలం 17 బంతుల్లో 52 పరుగులు సాధించి రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. వైభవ్ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 5 కళ్లు చెదిరే సిక్సర్లు ఉండటం గమనార్హం.

వైభవ్ సూర్యవంశీ అరుదైన ఐపీఎల్ రికార్డులు
వైభవ్ సూర్యవంశీ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు ఆడిన కేవలం 8 మ్యాచ్‌ల్లోనే వైభవ్ 304 పరుగులు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. వైభవ్ సూర్యవంశీ స్ట్రైక్ రేట్ 218.70గా ఉందంటేనే అతని దూకుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్ చరిత్రలో సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించడమే కాకుండా.. కేవలం 35 బంతుల్లోనే గుజరాత్ టైటాన్స్‌పై గతంలో సెంచరీ బాది, లీగ్ చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

గుజరాత్ టైటాన్స్ జట్టుతో నేడు అసలైన పరీక్ష
నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరగబోయే మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ మరోసారి తన బ్యాట్‌తో మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి. గుజరాత్ జట్టులో ఉన్నకగిసో రబాడ, మహమ్మద్ సిరాజ్ వంటి అంతర్జాతీయ స్టార్ పేసర్లను ఈ 15 ఏళ్ల కుర్రాడు ఎలా ఎదుర్కొంటాడనేది ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రాక్టీస్‌లో ఆర్చర్‌ను ఉతికేసిన ఈ వండర్ బాయ్, మ్యాచ్‌లో కూడా అదే విధ్వంసం కొనసాగిస్తే రాజస్థాన్ రాయల్స్ ఖాతాలో మరో విజయం చేరడం ఖాయం. వైభవ్ సూర్యవంశీ రూపంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఓ గొప్ప ఆయుధం లభించింది. ఈ కుర్రాడి దూకుడు చూస్తుంటే రాజస్థాన్ ఈసారి టైటిల్ రేసులో అందరికంటే ముందుండేలా కనిపిస్తోంది. మరి నేటి మ్యాచ్‌లో వైభవ్ ఎలాంటి విన్యాసాలు చేస్తాడో వేచి చూడాల్సిందే!

Story first published: Saturday, April 4, 2026, 14:15 [IST]
Other articles published on Apr 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+