టీమిండియా యువ సంచలనం కేవలం 14 ఏళ్ల వయస్సులోనే క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న వైభవ్ సూర్యవంశీ మరోసారి బ్యాట్‌తో గర్జించాడు. దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న అండర్-19 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి ముందు జరిగిన వార్మప్ మ్యాచ్‌లో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.శనివారం స్కాట్లాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో భారత ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ స్కాట్లాండ్ బౌలర్లను ఊచకోత కోశాడు.
వార్మప్ మ్యాచ్‌లో సిక్సర్ల విందు
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాకు వైభవ్ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 50 బంతుల్లోనే 96 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. 192.00 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన వైభవ్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 7 భారీ సిక్సర్లు ఉన్నాయి. వరుసగా రెండో సెంచరీ దిశగా సాగుతున్న వైభవ్ సూర్యవంశీ మను సారస్వత్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి థామస్ నైట్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

భీకర ఫామ్‌లో సూర్యవంశీ
వైభవ్ గత కొన్ని రోజులుగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన యూత్ వన్డే సిరీస్‌లో కేవలం 74 బంతుల్లోనే 127 పరుగులు (10 సిక్సర్లు, 9 ఫోర్లు) బాదాడు. ఇప్పుడు మళ్లీ 96 పరుగుల ఇన్నింగ్స్‌తో తానెంతటి ప్రమాదకరమైన ఆటగాడో నిరూపించుకున్నాడు. ఈ 14 ఏళ్ల కుర్రాడి దూకుడు చూస్తుంటే వరల్డ్ కప్‌లో భారత్‌కు తిరుగుండదనిపిస్తోంది. వైభవ్ సూర్యవంశీ ప్రస్తుత ఫామ్ చూస్తుంటే, ఈసారి అండర్-19 వరల్డ్ కప్ ట్రోఫీని భారత్ ముద్దాడటం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.
అండర్-19 వరల్డ్ కప్ 2026.. భారత్ షెడ్యూల్
ఈ మెగా టోర్నీ జనవరి 15 నుంచి ప్రారంభం కానుంది. గ్రూప్ స్టేజ్‌లో భారత జట్టు షెడ్యూల్ ఇలా ఉంది.
*జనవరి 15: అమెరికాతో తొలి మ్యాచ్.
*జనవరి 17: బంగ్లాదేశ్‌తో పోరు.
జనవరి 24: న్యూజిలాండ్‌తో మ్యాచ్