చెలరేగిన పూరన్-పొలార్డ్ .. 17 ఏళ్ల రికార్డు బద్దలు!!

కటక్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బారాబతి స్టేడియంలో ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా అద్భుత విజయం సాధించింది. రోహిత్ శర్మ (63 బంతుల్లో 63; 8 ఫోర్లు, 1 సిక్స్), కేఎల్ రాహుల్ (89 బంతుల్లో 77; 8 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ విరాట్ కోహ్లీ (81 బంతుల్లో 85; 9 ఫోర్లు) అర్ధ శతకాలతో రాణించడంతో భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన కోహ్లీసేన ఈ ఏడాదిని ఘనంగా ముగించింది.

చెలరేగిన పూరన్-పొలార్డ్
మూడో వన్డేలో మొదటగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ బ్యాటింగ్‌లో సత్తాచాటింది. నిర్ణీత 50 ఓవర్లలో 315 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ చివరలో యువ ఆటగాడు నికోలస్ పూరన్ (89; 64 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ కీరన్ పొలార్డ్ (74 నాటౌట్; 51 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లు)లు ధాటిగా ఆడారు. ఈ క్రమంలో ఐదో వికెట్‌కు 135 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

17 ఏళ్ల రికార్డు బ్రేక్:
పూరన్-పొలార్డ్‌లు ఐదో వికెట్‌కు 135 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో ఒక రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ 135 పరుగుల భాగస్వామ్యమమే భారత్‌పై విండీస్‌కు అత్యధిక ఐదో వికెట్ భాగస్వామ్యంగా నమోదైంది. దాంతో 17 ఏళ్ల రికార్డు బద్దలైంది. 2002లో శామ్యూల్స్-పావెల్‌లు ఐదో వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించగా.. ఆ రికార్డును పూరన్-పొలార్డ్‌లు తిరగరాశారు.

శార్దూల్ సూపర్:
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ దిగిన వెస్టిండీస్ ఆరంభంలో నెమ్మదిగా ఆడినా.. పూరన్, పొలార్డ్ విజృంభించడంతో 5 వికెట్లకు 315 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అరంగేట్ర పేసర్ నవ్ సైనీ 2 వికెట్లు పడగొట్టగా.. షమీ, శార్దూల్, జడేజాకు ఒక్కో వికెట్ దక్కింది. అనంతరం లక్ష్యఛేదనలో కోహ్లీ, రోహిత్, రాహుల్ అదరగొట్టట్టారు. ఇన్నింగ్స్ చివరలో పేసర్ శార్దూల్ ఠాకూర్ సూపర్ ఇన్నింగ్స్‌కు తోడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా విలువైన పరుగులు చేయడంతో భారత్ 48.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 316 పరుగులు చేసింది. కోహ్లీ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్', రోహిత్ 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డులు అందుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications