న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2022 final: భారత సంతతికి చెందిన 13 ఏళ్ల బాలిక సంచలనం..!!

 13 year old of Indian origin Janaki Easwar will perform in the closing ceremony of the T20 World Cup

మెల్‌బోర్న్: ఇంకొన్ని గంటలు- టీ20 ప్రపంచకప్ 2022 ఘనంగా ముగియబోతోంది. చిట్ట చివరి పోరు కోసం ఇంగ్లాండ్ - పాకిస్తాన్ సమాయాత్తమౌతోన్నాయి. కప్ కోసం ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌లో మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. ఈ తుదిపోరు కోసం క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తికరంగా ఎదురు చూస్తోంది.

ఈ నెల 10వ తేదీన అడిలైడ్‌లో జరిగిన రెండో సెమీ ఫైనల్స్‌లో భారత క్రికెట్ జట్టును ఇంగ్లాండ్ మట్టి కరిపించిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లల్లో 168 పరుగులు చేయగా.. ఈ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 16 ఓవర్లల్లోనే ఛేదించింది. ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 170 పరుగులు చేసింది. ఓపెనర్లు జోస్ బట్లర్ - 80, అలెక్స్ హేల్స్ - 86 పరుగులు చేశారు. నాటౌట్‌గా నిలిచారు. బలమైన టీమిండియాను ఓడించింది ఫైనల్‌లో అడుగు పెట్టింది ఇంగ్లాండ్.

 13 year old of Indian origin Janaki Easwar will perform in the closing ceremony of the T20 World Cup

అనూహ్య పరిస్థితుల మధ్య పాకిస్తాన్.. ఫైనల్‌లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. సూపర్ 12 దశలోనే ఇంటిదారి పట్టాల్సిన బాబర్ ఆజమ్ సేన ఎవ్వరూ ఊహించని విధంగా ఫైనల్‌లో ఎంట్రీ ఇచ్చింది. సూపర్ 12 దశలో నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోవడం, అదే సమయంలో బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ ఘన విజయాన్ని సాధించడం చకచకా సాగాయి. ఆ విజయంతో పాకిస్తాన్ సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. సెమీస్‌లో న్యూజిలాండ్‌ను ఓడించింది.

 13 year old of Indian origin Janaki Easwar will perform in the closing ceremony of the T20 World Cup

ఫైనల్‌లో రోహిత్ సేన లేకపోవడం భారత్ అభిమానులను తీవ్రంగా నిరాశకు గురి చేసింది. 2007లో ప్రారంభ టోర్నమెంట్‌లో ఛాంపియన్‌గా నిలిచిన తరువాత ఇప్పటివరకు టీమిండియా ఈ కప్‌ను అందుకోలేదు. ఆ లోటు ఇప్పుడు తీరుతుందని ఆశించినప్పటికీ అది సాధ్యం కాలేదు. టీమిండియా లేకపోవడం వల్ల ఫైనల్‌ కోసం భారత అభిమానులు పెద్దగా ఆసక్తి చూపట్లేదు.

అదే సమయంలో- ఈ టీ20 ప్రపంచకప్ 2022లో క్లోజింగ్ సెరిమనీ మాత్రం అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. దీనికి కారణం లేకపోలేదు. భారత సంతతికి చెందిన 13 సంవత్సరాల బాలిక జానకి ఈశ్వర్ ఇందులో పెర్‌ఫార్మ్ చేయబోతోంది. ఆస్ట్రేలియాకు చెందిన రాక్ బ్యాండ్ ఐస్‌హౌస్‌తో కలిసి ఆమె పెర్‌ఫార్మ్ చేస్తారు. మొత్తం 90,000 మంది ఈ టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. జానకి ఈశ్వర్ తల్లిదండ్రుల సొంత స్థలం కేరళలోని కోజికోడ్. 15 సంవత్సరాల కిందటే జానకి తల్లిదండ్రులు ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు.

భలే ఛాన్స్ కొట్టిన జై షా - ఐసీసీలో కీలక పదవి: రూ.వేల కోట్ల లావాదేవీలు..!!భలే ఛాన్స్ కొట్టిన జై షా - ఐసీసీలో కీలక పదవి: రూ.వేల కోట్ల లావాదేవీలు..!!

Story first published: Saturday, November 12, 2022, 16:51 [IST]
Other articles published on Nov 12, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X