Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

12ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున: #మొమొరీ పేరిట ఫేస్‌బుక్‌లో యువీ భావోద్వేగం!

12 years after 6 sixes, Yuvraj Singh shares adorable throwback picture

హైదరాబాద్: సెప్టెంబర్ 19... టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ క్రికెట్ కెరీర్‌లో మరిచిపోలేని రోజు. సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఇదే రోజున 6 బంతుల్లో 6 సిక్సులు బాదాడు. తన క్రికెట్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ఈ రోజున యువరాజ్ సింగ్ తన చిన్ననాటి ఫోటోను ఫేస్‌బుక్ పేజిలో అభిమానులతో పంచుకున్నాడు.

వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదుతానని తాను కూడా ఊహించలేదని యువరాజ్ సింగ్ ఈ సందర్భంగా కామెంట్ పెట్టాడు. తన ఫేస్‌బుక్ పేజిలో "12 ఏళ్ల! వరుసగా 6 సిక్సులు బాదుతానని అనుకోలేదు. దీనికోసం చిన్నతనంలోనే ప్రాక్టీస్ మొదలుపెట్టా? స్పెషల్ #మొమొరీ. 666666" అంటూ పోస్టు పెట్టాడు.

12ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున

12ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున

12ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున (సెప్టెంబర్ 19) టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికా వేదికగా 2007లో జరిగిన ఐసీసీ వరల్డ్ టీ20లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాది పీడకల మిగిల్చాడు.

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాప్‌ అనవసరంగా యువీని రెచ్చగొట్టి భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్‌ వేసిన 19వ ఓవర్‌లో యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సులు సాధించడంతో పాటు 12 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు.

16 బంతుల్లో 58 పరుగులు

16 బంతుల్లో 58 పరుగులు

ఈ మ్యాచ్‌లో యువీ 16 బంతుల్లో 58 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. భారత ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్ (68), గౌతం గంభీర్ (58) అద్భుతమై ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఔటయ్యారు. అనంతరం 19 పరుగుల వ్యవధిలో వీరిద్దరితో పాటు రాబిన్‌ ఊతప్ప(6) ఔటయ్యాక.. కెప్టెన్‌ ధోనీ(10), యువరాజ్‌(58) క్రీజులోకి వచ్చారు.

నాలుగో వికెట్‌కు 61 పరుగులు

నాలుగో వికెట్‌కు 61 పరుగులు

చివరి మూడు ఓవర్లలో వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 61 పరుగులు జోడించగా యువరాజ్ సింగ్ ఏకంగా 16 బంతుల్లోనే 58 పరుగులు చేశాడు. 19వ ఓవర్‌ ఐదో బంతికి ఫ్లింటాప్‌ బౌలింగ్‌లో కాలింగ్‌వుడ్‌ చేతికి చిక్కి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 218 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌పై టీమిండియా 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Story first published: Thursday, September 19, 2019, 19:57 [IST]
Other articles published on Sep 19, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+