చెత్త డబ్బాల సేకరణ: యాషెస్ మ్యాచ్‌ని వీక్షించడం కోసం ఓ చిన్నారి సాహసం

హైదరాబాద్: ఆ చిన్నారికి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. తనకు ఇష్టమైన యాషెస్ సిరిస్‌ను చూసేందుకు గాను నాలుగేళ్ల పాటు పొరుగింటి వారి చెత్తను సేకరించి తద్వారా వచ్చిన డబ్బుతో టికెట్ కొనుక్కోని ఆస్ట్రేలియా నుంచి ఇంగ్లాండ్‌కు వచ్చాడు. ప్రస్తుతం మాంచెస్టర్ వేదికగా ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్నాడు.

వివరాల్లోకి వెళితే..

2015లో మ్యాక్స్ వెయిట్ అనే 12 ఏళ్ల కుర్రాడు సొంతగడ్డపై ఆస్ట్రేలియా వన్డే వరల్డ్‌కప్‌ను గెలవడం చూశాడు. ఆ సమయంలోనే అతడు నిర్ణయించుకున్నాడు నాలుగేళ్ల తర్వాత ఇంగ్లాండ్‌ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరిస్‌ను కూడా చూడాలని. ఈ విషయాన్ని తన తండ్రి డామియన్ వెయిట్‌కు వివరించాడు.

మాంచెస్టర్‌లో డబుల్ సెంచరీతో స్మిత్ బద్దలు కొట్టిన మొత్తం రికార్డులివే!

యుకేకు తీసుకెళ్తానని చెప్పిన తండ్రి

యుకేకు తీసుకెళ్తానని చెప్పిన తండ్రి

డామియన్ వెయిట్ 1500 ఆస్ట్రేలియన్ డాలర్లు సంపాదిస్తే కుమారుడిని లండన్‌కు తీసుకెళ్తానని చెప్పాడు. దీంతో మాక్స్ అతడి తల్లి వీకెండ్స్‌లో పొరుగువారి చెత్త డబ్బాలను బయటకు తీయాలనే ఆలోచనతో ముందుకు వచ్చారు. ఇంకేముంది ప్రతి వీకెండ్స్‌లో పొరుగువారి చెత్త డబ్బాలను ఒక ఆస్ట్రేలియా డాలర్‌కు తీయాలని నిర్ణయించుకున్నారు.

పొరుగువారి చెత్త డబ్బాలను తీసి

పొరుగువారి చెత్త డబ్బాలను తీసి

ఇలా నాలుగేళ్ల పాటు వారిద్దరూ పొరుగువారి చెత్త డబ్బాలను తీసి వారికి కావాల్సిన 1500 ఆస్ట్రేలియన్ డాలర్లను సంపాదించారు. ఈ విషయాన్ని తండ్రికి తెలియజేయడంతో మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టును ప్రత్యక్షంగా వీక్షించే విధంగా మాక్స్ తండ్రి టికెట్లను బుక్ చేశాడు.

మాజీ క్రికెట్ దిగ్గజాలతో కలుసుకునే అవకాశం

మాజీ క్రికెట్ దిగ్గజాలతో కలుసుకునే అవకాశం

ఈ విషయం తెలుసుకున్న క్రికెట్ ఆస్ట్రేలియా మాక్స్‌ను ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజాలతో కలుసుకునే ఏర్పాటు చేసింది. మాక్స్ మాట్లాడుతూ "స్టీవ్ వా, జస్టిన్ లాంగర్, నాథన్ లయాన్ పక్కనే కూర్చున్నాను. నాలుగో టెస్టుకు సంబంధించిన ప్లాన్ బుక్‌ను కోచ్ జస్టిన్ లాంగర్ నాకు చూపించారు. స్టీవా వాతో మాట్లాడటం అమేజింగ్" అని చెప్పుకొచ్చాడు.

స్టీవ్ స్మిత్‌తో మాట్లాడటం

దీంతో పాటు అతడికి ఇష్టమైన ఇద్దరు ఆటగాళ్లను మాక్స్ కలిశాడు. "స్టీవ్ స్మిత్, ప్యాట్ కమ్మిన్స్ నా ఫేవరేట్ క్రికెటర్లు. గేమ్‌కు ఎలా సన్నద్ధమవుతారు, ఎలా ఆడతారు అనే దాని గురించి నేను వారితో మాట్లాడాను. నాకెంతో సంతోషంగా అనిపించింది" అని మాక్స్ తెలిపాడు. ఆటలో రెండో రోజైన గురువారం లంచ్ విరామ సమయంలో ఆసీస్ పేసర్ జేమ్స్ ప్యాటిన్సన్ మాక్స్‌కు సంతకం చేసిన జెర్సీని అందించాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Friday, September 6, 2019, 16:54 [IST]
Other articles published on Sep 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X