VIDEO: సరిగ్గా 11 ఏళ్ల క్రితం ప్రపంచ రికార్డుని నెలకొల్పిన సచిన్ టెండూల్కర్

హైదరాబాద్: సరిగ్గా 11 ఏళ్ల క్రితం ఇదే రోజున(ఆక్టోబర్ 17, 2008) క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అప్పటి వరకు వెస్టిండిస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా పేరిట ఉన్న రికార్డుని బద్దలు కొట్టాడు.
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా మొహాలీలోని పీసీఏ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ ఈ అరుదైన రికార్డు నెలకొల్పాడు. సిరిస్‌లో రెండో టెస్టు కాగా... సచిన్ టెండూల్కర్‌కు 152వ టెస్టు కావడం విశేషం. 11,953 పరుగులతో అగ్రస్థానంలో ఉన్న బ్రియాన్ లారా రికార్డుని సచిన్ అధిగమించాడు.

111 బంతుల్లో 88 పరుగులు
ఈ రికార్డుని సాధించిన తర్వాత ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్లు రికీ పాంటింగ్, పీటర్ సిడ్డిల్‌లతో పాటు పలువురు ఆటగాళ్లు సచిన్‌ను అభినందించారు. ఈ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ 111 బంతుల్లో 88 పరుగులు చేసి వెనుదిరిగాడు. తన కెరీర్‌లో మొత్తం 200 టెస్టులాడిన సచిన్ 15,921 పరుగులు చేశాడు.

టెస్టుల్లో అత్యధిక పరుగులు
టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మోడ్రన్ డే క్రికెట్‌లో విరాట్ కోహ్లీ(7054 పరుగులు), జో రూట్(7043), స్టీవ్ స్మిత్(6973) సచిన్ రికార్డుని అందుకుంటారేమో చూడాలి మరి. ఇక, టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ తర్వాత రికీ పాంటింగ్(13378) పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.

1989లో అరంగేట్రం
కాగా, 1989లో అంతర్జాతీయ అరంగ్రేటం చేసిన సచిన్ టెండూల్కర్ సెప్టెంబర్ 9, 1994న తన మొదటి సెంచరీ సాధించాడు. 78 మ్యాచ్‌లు ఆడిన తర్వాతే తొలి సెంచరీని అందుకోవడం విశేషం. టెస్టుల్లో 51 సెంచరీలు, వన్డేల్లో 49 సెంచరీలు కలుపుకుని క్రికెట్‌లో 100 సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్.

అత్యధిక పరుగులు రికార్డు సచిన్ పేరిట
టెస్టుల్లో, వన్డేల్లో కూడా అత్యధిక పరుగులు రికార్డు సచిన్ పేరిట ఉండటం విశేషం. కాగా, 11 ఏళ్ల క్రితం ఇదే రోజున సచిన్ టెస్టుల్లో అత్యధిక పరుగుల రికార్డుని గుర్తు చేస్తూ బీసీసీఐ తన ట్వీటర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications