లారా వార్నింగ్: 11 ఏళ్ల క్రితం ధోనికి చేదు అనుభవం (వీడియో)
హైదరాబాద్: కెప్టెన్ కూల్‌గా పేరుగాంచిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి సరిగ్గా 11ఏళ్ల క్రితం వెస్టిండిస్‌లో ఓ చేదు అనుభవం ఎదురైంది. 2006లో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలోని టీమిండియా వెస్టిండిస్‌లో పర్యటించింది. ఈ సిరిస్‌లో ధోని అద్భుత ప్రదర్శన చేశాడు.
అంతేకాదు హెలికాప్టర్ షాట్లతో చెలరేగిపోయిన ధోని భీకరమైన విండీస్ బౌలర్లకి చుక్కలు చూపించాడు. ఆ సిరీస్‌లోని ఓ టెస్టు మ్యాచ్‌లోని 151వ ఓవర్ ఐదో బంతిని ధోని భారీ షాట్‌గా ఆడాడు. ఈ క్రమంలో ధోని కొట్టిన బంతిని బౌండరీ లైన్ వద్ద వెస్టిండీస్ ఫీల్డర్ డారెన్ గంగ క్యాచ్‌గా అందుకున్నాడు.

ధోనిని ఆపిన ఫీల్డ్ అంపైర్
దీంతో ధోని పెవిలియన్‌కి వేగంగా వెళ్లిపోతుండగా.. ఫీల్డ్ అంపైర్ ఆపాడు. క్యాచ్ పట్టే సమయంలో డారెన్ బౌండరీ లైన్‌ని తాకినట్లు అనుమానించిన ఫీల్డ్ అంపైర్ అసద్ రౌఫ్ తుది నిర్ణయం కోసం థర్డ్ అంపైర్ బిల్లీ డాక్ట్రోవ్ సాయం కోరాడు. అయితే కెమెరామెన్ బంతి గమనాన్ని వేగంగా చిత్రీకరించడంలో పూర్తిగా విఫలమయ్యాడు.

వీడియోలో క్లారిటీ లేకపోవడం వల్లే
దీంతో క్యాచ్ అందుకున్న వీడియోలో క్లారిటీ లేకపోవడంతో థర్డ్ అంపైర్ ఎలాంటి నిర్ణయం ప్రకటించలేకపోయాడు. దీంతో చివరికి ఫీల్డ్ అంపైర్లు ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్' కింద ధోనీని నాటౌట్‌గా ప్రకటించారు. ఈ క్రమంలో ఫీల్డ్ అంపైర్ల మధ్య ఈ చర్చ జరుగుతుండగా.. వెస్టిండీస్ కెప్టెన్ బ్రియాన్ లారా ధోనీ వద్దకు వచ్చి మాట్లాడాడు.

ధోనిని హెచ్చరించిన బ్రియాన్ లారా
‘మా జట్టు ఆటగాళ్ల తరఫున నేను బాధ్యత తీసుకుని మాట్లాడుతున్నాను. ఫీల్డర్ సరిగానే క్యాచ్ అందుకున్నాడు. అతను చెప్తోంది వాస్తవమని నేను నమ్ముతున్నాను. నువ్వు అవుట్, వేచి చూడకుండా పెవిలియన్‌కి వెళ్లిపోతే బాగుంటుంది' అని వార్నింగ్ ఇచ్చాడంట.
డగౌట్ నుంచి చూసిన రాహుల్ ద్రవిడ్
ఇదే సమయంలో ధోనితో మైదానంలో వెస్టిండిస్ కెప్టెన్ బ్రియాన్ లారా ప్రవర్తనను డగౌట్ నుంచి చూస్తున్న రాహుల్ ద్రవిడ్ ‘ఏం జరుగుతోంది అక్కడ?' అనేలా చేతులూ ఊపాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే టీమిండియా తన ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేసింది. అప్పుడే అంతర్జాతీయ కెరీర్‌ని ఆరంభించిన ధోనికి అది నాలుగో టెస్టు కావడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications