ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు
తద్వారా ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు నెలకొల్పాడు. 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రిషబ్ పంత్ ఆ తర్వాత మైదానంలో బౌండరీ వర్షం కురిపించాడు. పుల్ షాట్లు, స్వీప్‌లు, స్కూప్‌లు.. ఇలా చివరి ఓవర్ వరకూ ఫోర్లు, సిక్సులతో విరుచుకు పడ్డాడు. ఈ మ్యాచ్‌లో ఏ బౌలర్‌ను వదలకుండా బాదిన రిషబ్ పంత్.. ప్రపంచంలోనే అత్యుత్తమ డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అయిన భువనేశ్వర్ కమార్ బౌలింగ్‌లోనూ సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు.

11 బంతుల్లో 43 పరుగులు రాబట్టిన పంత్
ఈ మ్యాచ్‌లో మొత్తంగా భువి బౌలింగ్‌లో 11 బంతులు ఎదుర్కొన్న పంత్.. నాలుగు ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో ఏకంగా 43 పరుగులు రాబట్టాడు. భువీ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టిన పంత్.. ఆ ఓవర్లో 18 పరుగులు పిండుకొని సెంచరీ పూర్తి చేశాడు. ఇక భువీ వేసిన చివరి ఓవర్లో తొలి బంతికి మ్యాక్స్‌వెల్ ఔట్ కాగా.. ఆ తర్వాతి బంతుల్ని వరుసగా 4,4,6,6,6 బాదిన పంత్ ఆ ఓవర్లో 26 పరుగులు రాబట్టాడు.
చివరి 10 ఓవర్లలో ఢిల్లీ 138 పరుగులు
పంత్ విధ్వంసంతో చివరి 10 ఓవర్లలో ఢిల్లీ 138 పరుగులు సాధించింది. ఇక, రషీద్ బౌలింగ్‌లో 13 బంతుల్లో ఓ సిక్స్, నాలుగు ఫోర్లతో 27 పరుగులు రాబట్టాడు. 17వ ఓవర్లో రషీద్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌తో బౌండరీ బాదిన పంత్.. వెంటనే లాంగాఫ్‌లో బలమైన సిక్స్ బాదాడు. మొత్తంగా సన్ రైజర్స్ బౌలర్లలో భువి 4 ఓవర్లలో 51 పరుగులివ్వగా.. కౌల్ 48 పరుగులు సమర్పించుకున్నాడు. రషీద్ 35 పరుగులిచ్చాడు. ఈ ముగ్గురూ కలిసి 134 పరుగులిచ్చి.. ఒకే వికెట్ తీసుకోవడం గమనార్హం.

ఈ సీజన్‌లో నమోదైన మూడో సెంచరీ
ఐపీఎల్ కెరీర్‌లో రిషబ్ పంత్‌కి ఇదే తొలి సెంచరీ కాగా ఈ సీజన్‌లో నమోదైన మూడో సెంచరీ. టోర్నీ ఆరంభంలోనే క్రిస్‌గేల్ (పంజాబ్), షేన్ వాట్సన్ (చెన్నై) సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసినా అయినా ఫలితం లేకపోయింది. ఢిల్లీ డేర్‌డెవిల్స్ నిర్దేశించిన 188 పరుగుల లక్ష్య చేధనలో శిఖర్ ధావన్(92 నాటౌట్; 50 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు), విలియమ్సన్(80 నాటౌట్; 53 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు)లు సూపర్ బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ అలవోకగా ఛేదించింది.

ఐపీఎల్‌లో సెంచరీ చేసిన రెండో పిన్న వయస్కుడు
కాగా, తాజా ఇన్నింగ్స్‌తో రిషబ్ పంత్ ఐపీఎల్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. అంతేకాదు ఐపీఎల్‌లో సెంచరీ సాధించిన రెండో పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పిన రిషబ్ పంత్ (20 ఏళ్ల 218 రోజులు) మనీష్ పాండే (19 ఏళ్ల 253 రోజులు) తర్వాతి స్థానంలో నిలిచాడు. ఇక, ఓ బ్యాట్స్‌మెన్ 128 రన్స్ చేసినా అతడి జట్టు ఓడటం ఐపీఎల్ చరిత్రలోనే ఇది తొలిసారి. గతంలో ఈ రికార్డ్ ఆండ్రూ సైమండ్స్ పేరిట ఉండేది. సైమండ్స్ 2008లో రాయల్ ఛాలెంజర్స్‌పై 117 పరుగులతో నాటౌట్‌గా నిలిచినప్పటికీ డెక్కన్ ఛార్జర్స్‌ను గెలిపించలేకపోయాడు.


Click it and Unblock the Notifications












