#OnThisDay in 2011: వరల్డ్‌కప్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ

హైదరాబాద్: భారత్‌లో జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో ఓ అరుదైన రికార్డు నమోదై శుక్రవారానికి ఏడేళ్లు పూర్తి అయింది. మార్చి 2, 2011 బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇంగ్లాండ్-ఐర్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ ఆటగాడు కెవిన్ ఓబ్రెయిన్ 50 బంతుల్లో సెంచరీని నమోదు చేశాడు.
తద్వారా వరల్డ్ కప్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా ఓబ్రెయిన్ అరుదైన ఘనత సాధించాడు. #OnThisDay పేరిట ప్రపంచ క్రికెట్‌లో నమోదైన అరుదైన రికార్డులను ఐసీసీ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. శుక్రవారం #OnThisDay పేరిట ఈ రికార్డుని ట్విట్టర్‌లో పోస్టు చేసింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 328 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ బ్యాట్స్‌మన్ కెవిన్ ఓబ్రెయిన్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఐర్లాండ్ చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో ఓబ్రెయిన్ మొత్తం 63 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్సుల సాయంతో 113 పరుగులు సాధించాడు.
ఈ క్రమంలో అతడు 50 బంతుల్లోనే అతను సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇప్పటి వరకు జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో నమోదైన అత్యంత వేగవంతమైన సెంచరీ ఓబ్రెయిన్ పేరిటే నమోదైంది.
Story first published: Friday, March 2, 2018, 16:54 [IST]
Other articles published on Mar 2, 2018
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications