100 రోజుల్లో వన్డే వరల్డ్‌కప్: టీమ్‌తో పాటు గేమ్ ఛేంజర్స్ వీరే!


హైదరాబాద్: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్‌కప్ మెగా టోర్నీకి సమయం దగ్గర పడుతోంది. నాలుగేళ్ల కొకసారి జరిగే ఈ వరల్డ్‌కప్‌కు ఈ ఏడాది ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోంది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వబోతోంది. చివరగా 1999లో ఆ దేశం ఈ మెగా టోర్నీని నిర్వహించింది.
ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఆతిథ్యమిస్తోన్న ఈ వరల్డ్‌కప్‌లో మొత్తం పది జట్లు బరిలో దిగుతున్నాయి. 11 వేదికల్లో జరిగే ప్రపంచకప్‌లో మొత్తం 48 మ్యాచ్‌లు అభిమానులను అలరించనున్నాయి. ఈ ఏడాది మే 30న ప్రారంభమయ్యే ఈ వరల్డ్ కప్ జూలై 14న ముగియనుంది. ఈ సారి వరల్డ్‌కప్‌ను రౌండ్‌రాబిన్ పద్థతిలో నిర్వహిస్తున్నారు.
టాప్-4లో నిలిచిన జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశిస్తాయి. సెమీస్ విజేతలు చారిత్రక లార్డ్స్ మైదానంలో ఫైనల్లో తలపడతాయి. ఐదుసార్లు వరల్డ్‌కప్‌ను నెగ్గిన డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో పాటు భారత్, ఇంగ్లాండ్ టైటిల్ ఫేవరెట్లలో ముందువరుసలో ఉన్నాయి. వరల్డ్‌కప్ టోర్నీకి సరిగ్గా 100 రోజులు ఉన్న నేపథ్యంలో అభిమానుల కోసం ప్రత్యేకం.

ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా జట్టు ఐదుసార్లు వరల్డ్‌కప్‌ను నెగ్గింది. ఈ ఏడాది ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. మరోసారి టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు ఆస్ట్రేలియా ఉవ్విళ్లూరుతోంది. అయితే బాల్ ట్యాంపరింగ్ ఉదంతం తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా వరుస పరాజయాలను చవిచూస్తోంది. ఇటీవల సొంత గడ్డపై కోహ్లీసేన చేతిలో టెస్టు సిరిస్ ఓటమి ఆ జట్టుని మరింతగా కుంగదీసింది. దీనికి తోడు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌పై నిషేధం ఆ జట్టు గెలుపు అవకాశాలను దెబ్బతీసింది. దీంతో వరల్డ్ కప్ వరకు ఆసీస్ మాజీ దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్‌ను సహాయక కోచ్‌గా నియమించడం ఏమన్నా కలిసొస్తుందే చూడాలి.

ఇంగ్లాండ్
1975లో వన్డే వరల్డ్ కప్ టోర్నీ మొదలైప్పటి నుంచీ ఇప్పటి వరకు ఇంగ్లాండ్ ఖాతాలో వరల్డ్ కప్ టైటిల్‌ను గెలవలేకపోయింది. 1979, 1992 టోర్నీల్లో ఫైనల్‌కు చేరినా విజేతగా నిలవలేకపోయింది. చివరగా 2015లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన వరల్డ్ కప్‌లో గ్రూపు దశలోనే నిష్క్రమించి నిరాశపరిచింది. ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలో సొంతగడ్డపై పోటీకి దిగుతున్న ఇంగ్లాండ్ ప్రస్తుతం టోర్నీలో ఫేవరేట్ జట్లలో ఒకటిగా ఉంది.

దక్షిణాఫ్రికా
దక్షిణాఫ్రికా జట్టుకు వరల్డ్ కప్ మెగా టోర్నీ ఏనాడూ కలిసి రాలేదనే చెప్పాలి. 1992 నుంచి మొదలుపెడితే.. 2015 వరకు ఏ టోర్నీలోనూ దక్షిణాప్రికా జట్టు ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయింది. సఫారీ జట్టులో అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్నప్పటికీ, ఒత్తిడికిలోనై చిత్తుగా ఓడిన సందర్భాలు అనేకం. ఏబీ డివిలియర్స్, మోర్నీ మోర్కెల్ లాంటి కీలక ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించడం జట్టు గెలుపు అవకాశాలపై ప్రభావం చూపనుంది.

పాకిస్థాన్, న్యూజిలాండ్
పాకిస్థాన్ జట్టు నిలకడలేమికి మారుపేరు. రెండేళ్ల క్రితం ఇంగ్లాండ్ వేదికగా జరిగిన భారత్‌పై చాంపియన్స్ ట్రోఫీని దక్కించుకున్న పాకిస్థాన్ జట్టు సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్సీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తోంది. ఇక, మ్యాచ్ గమనాన్ని మార్చగలిగే ఆల్‌రౌండర్లు ఉన్నప్పటికీ.. న్యూజిలాండ్‌కు ప్రపంచకప్ ఇప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలింది. మరోవైపు న్యూజిలాండ్ ఈసారైనా తమ వరల్డ్‌కప్ ఆశలు నెరవేర్చుకోవాలనే గట్టి పట్టుదలతో ఉంది.

ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్
ఈ ఏడాది వరల్డ్ కప్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. ఎనిమిది జట్లు ర్యాంకింగ్స్ ద్వారా నేరుగా వరల్డ్‌కప్‌కు అర్హత సాధించగా.. వెస్టిండీస్, అఫ్గానిస్థాన్ అర్హత టోర్నీ ద్వారా బెర్తులు సాధించాయి. జింబాబ్వేపై ఉత్కంఠ విజయంతో ప్రపంచకప్‌నకు అర్హత సాధించిన ఆఫ్ఘన్ సంచలనాలు సృష్టించేందుకు తహతహలాడుతోంది. యువ స్పిన్నర్ రషీద్‌ఖాన్ ఈ వరల్డ్ కప్‌లో ఆ జట్టు మ్యాచ్‌లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇక, బంగ్లాదేశ్ విషయానికి వస్తే.. తమీమ్ ఇక్బాల్, షకీబ్ ఉల్ హసన్, ముష్ఫీకర్ రహీమ్, మొర్తజా లాంటి స్టార్ ప్లేయర్లతో బలంగా కనిపిస్తోంది. ఇక శ్రీలంక, వెస్టిండీస్ తమ గతానికి భిన్నంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రెండు జట్లు లీగ్ దశలోనే నిష్క్రమించేలా ఉన్నాయి.

గేమ్ ఛేంజర్
ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో హాట్ ఫేవరెట్లలో భారత్ ఒకటి. విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమిండియా బలంగా కనిపిస్తోంది. ఇటీవల ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వరుస వన్డే సిరీస్ విజయాలతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంక్‌లో కొనసాగుతోంది. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, ధోనీ, అంబటి రాయుడు, జాదవ్‌లతో మిడిలార్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. ఇక, బౌలర్ల విషయానికి వస్తే భువనేశ్వర్, బుమ్రా, షమీకి తోడు చైనామన్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్‌లు ఈ వరల్డ్‌కప్‌లో ప్రభావితం చేయనున్నారు. 24 ఏళ్ల కుల్దీప్ యాదవ్ ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 19 వన్డేలాడిన కుల్దీప్ యాదవ్ మొత్తం 45 వికెట్లతో సత్తాచాటాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications