ప్రపంచకప్‌లో 10 జట్లు: సచిన్ తీవ్ర అసంతృప్తి, వెనుకడుగే...
సిడ్నీ: రానున్న ప్రపంచకప్‌లో పది జట్లకే అవకాశం ఇవ్వాలన్న ఐసీసీ నిర్ణయం పట్ల మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది బ్యాక్‌వార్డ్ స్టెప్‌గా అభివర్ణించాడు. ఇలాంటి నిర్ణయాలు క్రికెట్‌తో అసోసియేషన్ అయ్యే దేశాలను నిరాదరణకు గురి చేసినట్లుగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
సచిన్ టెండుల్కర్ ప్రస్తుత ప్రపంచకప్‌కు ఐసీసీ అంబాసిడర్‌గా ఉంటున్నాడు. జట్లను 10కి కుదించడం కాదని, 25 జట్లు ఆడేలా ప్రోత్సహించేందుకు కృషి చేయాలని సచిన్ సూచించాడు.

వచ్చే ప్రపంచకప్ నాటికి పది జట్లు ఉండాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందని, ఇది తనను పూర్తిగా నిరాశకు గురి చేసిందని చెప్పాడు. క్రికెట్ మ్యాచ్ సాధ్యమైనంత వరకు గ్లోబలైజ్ కావాలనేది తన ఆశ అన్నాడు. తన వరకు ఈ నిర్ణయం బ్యాక్ వార్డ్ స్టెప్ (వెనుకడుగు) అన్నాడు.
దీనిపై ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. జట్ల ఫీల్డ్ టాలెంట్‌ను బట్టి, ప్రపంచకప్ ఆసక్తికరంగా ఉండేందుకేనని ఆయన అభిప్రాయపడ్డారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications