Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మాన‌వత్వమే లేదు: కుంబ్లేను వ‌ద్దన్న ఆ పది మంది ఎవ‌రు?

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ప్రస్తుతం లండన్‌లో పర్యటిస్తోంది. మ‌రోవైపు కొత్త‌ కోచ్ ఎంపిక ప్రక్రియ‌తో అటు బీసీసీఐ, ఇటు ప్లేయ‌ర్స్ బిజీబిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కుంబ్లేకు టీమిండియా ప్లేయర్ల నుంచి ఘోర అవమానం ఎదురైంది.

కోచ్‌గా అనిల్ కుంబ్లే మాకు అవసరం లేదని భారత క్రికెట్ జట్టులోని పదిమంది సభ్యులు తేల్చి చెప్పారు. కుంబ్లే వ్యవహారశైలిపై అసంతృప్తిగా ఉన్న భారత జట్టులోని ఆటగాళ్లు కోచ్‌గా కుంబ్లేని ఇకపై ఎంతమాత్రం సహించబోమని తేల్చి చెప్పారంట. తమపై గుత్తాధిపత్యం చెలాయిస్తారని, శిక్షణ విషయంలో మానవత్వం లేకుండా ప్రవర్తిస్తారని ఆరోపించారు.

ఆటగాళ్లకు గాయాలు పాలైన కుంబ్లే పట్టించుకోరని అన్నారంట. ప్రస్తుత కోచ్ అనిల్ కుంబ్లేపై గత వారం బోర్డు సెక్ర‌ట‌రీ అమితాబ్ చౌద‌రి, జీఎం ఎంవీ శ్రీధ‌ర్‌, క్రికెట్ సలహా క‌మిటీ సభ్యుడు గంగూలీ జట్టు స‌భ్యుల అభిప్రాయం తెలుసుకున్న సంగతి తెలిసిందే.

వెలుగు చూసిన ఆసక్తికర అంశాలు

వెలుగు చూసిన ఆసక్తికర అంశాలు

ఇందులో కొన్ని ఆస‌క్తిక‌ర అంశాలు వెలుగుచూశాయి. జట్టులోని పది మంది ఆటగాళ్లు కోచ్‌గా కుంబ్లే ప‌ద‌వీకాలాన్ని పొడ‌గించ‌కూడ‌ద‌ని స్ప‌ష్టంచేశార‌ట. ఆటగాళ్ల పట్ల కుంబ్లే మరింత కఠినంగా ఉంటున్నట్లు ఆటగాళ్లు వీరికి ఫిర్యాదు చేశారు. ఆట‌గాళ్లకు గాయాలైనా, అల‌సిపోయినా.. వాళ్ల‌పై క‌నీస మాన‌వత్వం కూడా చూప‌డం లేద‌ని చెప్పారు.

టీమిండియాకు ఎన్నో విజయాలు

టీమిండియాకు ఎన్నో విజయాలు

కాగా గతేడాది జులైలో రవిశాస్త్రి నుంచి టీమిండియా కోచ్ బాధ్యతలు చేపట్టిన కుంబ్లే.. తన కఠిన శిక్షణతో విదేశాల్లో టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు. ఈ విజయాలను దృష్టిలో ఉంచుకొని ఆయన పదవీ కాలాన్ని 2019 వరల్డ్ కప్ వరకు పొడగిస్తారని అందరూ తొలుత భావించారు.

అంగీకరించని టీమిండియా జట్టు సభ్యులు

అంగీకరించని టీమిండియా జట్టు సభ్యులు

అయితే అందుకు జట్టులోని సభ్యులు అంగీకరించకపోవడంతో టీమిండియా జట్టుకు కొత్త కోచ్ కోసం దరఖాస్తులను బీసీసీఐ ఆహ్వానించింది. ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం కుంబ్లే పదవీ కాలం కూడా ముగియనుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, కుంబ్లేకు మధ్య విభేదాలు తలెత్తాయన్న వార్త‌లు బోర్డును మ‌రింత ఆందోళ‌న‌కు గురిచేశాయి.

కోచ్‌గా కుంబ్లే కొనసాగింపు అనుమానమే?

కోచ్‌గా కుంబ్లే కొనసాగింపు అనుమానమే?

ఈ నేపథ్యంలో కోచ్‌గా కుంబ్లే కొనసాగింపుపై బీసీసీఐ సెక్రెటరీ అమితాబ్ చౌదరి, ఎమ్‌వి శ్రీధర్, మాజీ కెప్టెన్, క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు సౌరవ్ గంగూలీ జట్టులోని ఆటగాళ్లతో చర్చించారు. జట్టు స‌భ్యుల మ‌ధ్య జ‌రిగిన వాట్సాప్ సంభాష‌ణ‌ను కుంబ్లే మీడియాకు లీక్ చేయ‌డంపై కోహ్లీ సీరియ‌స్ అయిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.

కొత్త కోచ్ ప్రయత్నాలు

కొత్త కోచ్ ప్రయత్నాలు

దీంతో బోర్డు రంగంలోకి దిగి సయోధ్య కుదర్చాలని చూసినప్పటికీ, ప‌ది మంది స‌భ్యులు కుంబ్లేను అంగీక‌రించ‌డం లేద‌ని తేల‌డంతో ఇక టీమిండియాకు కొత్త కోచ్ ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసేలోపు కొత్త కోచ్ ఎంపిక ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌ని బీసీసీఐ భావిస్తోంది.

అందుబాటులో లేని స‌చిన్‌, ల‌క్ష్మ‌ణ్‌, గంగూలీ

అందుబాటులో లేని స‌చిన్‌, ల‌క్ష్మ‌ణ్‌, గంగూలీ

బీసీసీఐ ఆహ్వానం మేరకు మాజీ టీమిండియా క్రికెటర్లు వీరేంద్ర సేహ్వాగ్, దొడ్డ గణేష్, లాల్ చంద్ రాజ్‌పుత్, మాజీ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ టామ్ మూడీ, రిచర్డ్ పైబస్ కోచ్ పదవి కోసం దరఖాస్తులు చేసుకున్న వారిలో ఉన్నారు. వచ్చే బుధ లేదా గురువారం లండన్‌లో ఈ ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశమున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఛాంపియన్స్‌ ట్రోఫీలో వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్న క్రికెట్‌ సలహా కమిటీ సభ్యులు గంగూలీ, సచిన్‌, లక్ష్మణ్‌లు తీరిక లేకుండా గడపుతున్నందువల్ల జూన్ 14(బుధవారం), 15(గురువారం) నిర్వహించే అవకాశముంది.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+