అక్లాండ్: ప్రపంచ కప్‌లో భాగంగా భారత జట్టు శనివారం నాడు జింబాబ్వేతో తలపడనుంది. గ్రూప్ బీలో ఉన్న భారత్ ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచుల్లోను గెలిచింది. జింబాబ్వే పైన గెలవడం ద్వారా అన్నింటా గెలిచిన రికార్డ్ సృ,ష్టించాలని ఉవ్వీళ్లూరుతోంది.
అక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో మ్యాచ్ జరగనుంది. ఇది డే అండ్ నైట్ మ్యాచ్. పాకిస్తాన్, వెస్టిండీస్, యూఏఈ, సౌతాప్రికా, ఐర్లాండ్ పైన వరుసగా ఐదు మ్యాచుల్లో గెలుపొందింది. శనివారం జింబాబ్వేతో తలపడనుంది. ఈ నేపథ్యంలో భారత్ - జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచులకు సంబంధించి కొన్ని ఆసక్తికర అంశాలు.

ప్రపంచ కప్‌లో ఇరు జట్లు కూడా ఎనిమిదిసార్లు తలపడ్డాయి. భారత్ ఏడు మ్యాచులలో నెగ్గగా, జింబాబ్వే 1 మ్యాచులో నెగ్గింది. ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లు ఎవరు కూడా జింబాబ్వేతో ఆడిన మ్యాచులో లేరు.
భారత్ - జింబాబ్వేలు తొలిసారి జూన్ 11 1983లో తలపడ్డాయి. ఈ మ్యాచులో భారత్ గెలిచింది.
ప్రస్తుతం ఇండియా కోచ్ డంకన్ ఫ్లెచర్.. 1983 ప్రపంచ కప్ సమయంలో జింబాబ్వే సారథి.
ప్రపంచ కప్‌లో భారత్ తరఫున 1983లో కపిల్ దేవ్ 175 పరుగులతో వ్యక్తిగత స్కోలో అందరికంటే ముందంజలో ఉన్నాడు. జింబాబ్వే తరఫున కెవిన్ 73 పరుగులు చేశాడు. ప్రస్తుతం అతను జట్టులో ఉన్నాడు. భారత్ తరఫున మరో సెంచరీ చేసిన వారిలో వినోద్ కాంబ్లీ ఉన్నాడు(1996).

జింబాబ్వే తరఫున ఓ ప్లేయర్ కూడా శతకం సాధించలేదు.
మదన్ లాల్, జవగల్ శ్రీనాథ్ ఆరేసి వికెట్లతో ఉన్నారు. పీటర్ రాసన్ ఏడు వికెట్లు తీశాడు.
అత్యధిక స్కోర్ చేసిన వారిలో కపిల్ దేవ్ ఉన్నాడు. నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిపి 228 పరుగులు చేశాడు. జింబాబ్వే తరఫున 161 పరుగులతో.. ఆండీ ఫ్లవర్ ఉన్నాడు.
ఎక్కువ మ్యాచులు అడింది మహమ్మద్ అజహరుద్దీన్, కపిల్ దేవ్, శ్రీకాంత్, ఇయాన్ బుచారట్, డేవ్ హాగ్‌టన్, ఆండీ పైక్రాఫ్ట్, జాన్ ట్రైకోస్.. ఒక్కొక్కరు ఐదు మ్యాచులు ఆడారు.
అత్యధిక జ్టు స్కోర్ - 266/8 in 1983. జింబాబ్వే 252/9 in 1999
మొత్తంగా వన్డేల్లో భారత్ - జింబాబ్వేలు 57 సార్లు తలపడ్డాయి. 44 మ్యాచులు భారత్ గెలిచింది. 10 మ్యాచుల్లో ఓడింది. రెండు మ్యాచులు టై కాగా, ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు.
భారత్ - జింబాబ్వే మధ్య జరిగిన ప్రపంచ కప్ మ్యాచులు, ఫలితాలు