For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందరి చూపు వారిద్దరిపైనే: భారత్-వెస్టిండిస్ మ్యాచ్‌‌పై 10 నిజాలు

By Nageswara Rao

ముంబై: ఐసీసీ వరల్డ్ టీ20 టోర్నీలో భాగంగా మార్చి 31న వాంఖడే స్టేడియంలో జరగనున్న రెండో సెమీ పైనల్ మ్యాచ్‌లో యావత్ క్రికెట్ అభిమానులందరి కళ్లు విరాట్ కోహ్లీ, క్రిస్‌గేల్ పైనే ఉన్నాయి. టోర్నీలో విరాట్ కోహ్లీ భారత్ తరుపున ఆడుతుండగా, క్రిస్ గేల్ వెస్టిండిస్ తరుపున ఆడుతున్నాడు.

అయితే ఇక్కడో విశేషం ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఈ ఇద్దరూ కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తరుపున ఆడుతున్నారు. అంతేకాదు బెంగుళూరు జట్టుకి విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆర్‌సీబీ జట్టులో ఈ ఇద్దరే కీలక ఆటగాళ్లు.

అలాంటి ఈ ఆటగాళ్లు ప్రత్యర్ధులుగా తలపడనుండటంతో ఈ మ్యాచ్‌పై క్రికెట్ అభిమానులు ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నారు. క్వార్టర్ ఫైనల్‌లో భాగంగా ఆస్ట్రేలియాపై మార్చి 27న జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 51 బంతుల్లో చేసిన 82 పరుగులు భారత్‌ను సెమీస్‌కు వచ్చేలా చేసిన సంగతి తెలిసిందే.

10 facts about India-West Indies World T20 semi-final in Mumbai

ఈ నేపథ్యంలో అభిమానులు ఈ మ్యాచ్‌లో కూడా కోహ్లీపై అలాంటి క్లాసిక్ ఇన్నింగ్స్‌పై అంచనాలు పెట్టుకున్నారు. వాంఖడే జరగనున్న ఈ మ్యాచ్ ఐసీసీ టోర్నీకే హైలెట్ మ్యాచ్ కానుందని క్రీడా నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య 10 ఆసక్తికర విషయాలు మీకోసం...


1. ఐసీసీ వరల్డ్ టీ20 సెమీస్‌లో భారత్ - వెస్టిండిస్ జట్లు తొలిసారి తలపడుతున్నాయి.

2. ఐసీసీ టీ20 టోర్నీ గ్రూప్ స్టేజీలో భారత్ - వెస్టిండిస్ జట్లు 3 సార్లు(2009, 2010, 2014) తలపడ్డాయి. వెస్టిండిస్ 2-1 తేడాతో ముందంజలో ఉంది.

3. వరల్డీ టీ20లో వెస్టిండిస్‌తో తలపడిన 3 సార్లు భారత జట్టుకు కెప్టెన్‌గా ధోని ఉన్నాడు. 2009, 2010లో టోర్నీల్లో వెస్టిండిస్ కెప్టెన్‌గా క్రిస్ గేల్ ఉన్నారు. ప్రస్తుత టోర్నీలో వెస్టిండిస్ కెప్టెన్‌గా డారెన్ సామీ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు.

4. ఇరు జట్ల మధ్య అత్యధిక స్కోరు 98 పరుగులు చేసిన ఆటగాడిగా క్రిస్ గేల్ పేరిట రికార్డు ఉంది. 2010లో ఆడిన మ్యాచ్లో 66 బంతుల్లో 98 పరుగులు చేశాడు.

5. వరల్డ్ టీ20లో ఇరు జట్ల మధ్య అద్భుతమైన బౌలింగ్‌ రికార్డు డ్వేన్ బ్రేవో పేరిట ఉంది. 2009లో లార్డ్స్ మైదానంలో ఆడిన మ్యాచ్లో 4 వికెట్లు తీసుకుని 38 పరుగులిచ్చాడు.

6. ప్రస్తుత ఇరు జట్ల మధ్య మ్యాచ్‌కు వేదికగా ఉన్న ముంబై వాంఖడే స్డేడియంలో 2011లో భారత్ వరల్డ్‌ను సొంతం చేసింది. శ్రీలంకతో ఆడిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది.

7. వరల్డ్ టీ20లో భారత్ మూడోసారి సెమీ ఫైనల్‌‌కు చేరుకుంది. 2007 ప్రారంభ టోర్నీలో సెమీస్‌కు చేరుకున్న టీమిండియా, ఆ తర్వాత 2014లో జరిగిన టోర్నీలో కూడా విజయం సాధించింది.

8. వెస్డిండిస్‌తో జరగనున్న మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే రికార్డుని నమోదు చేస్తుంది. వరల్డ్ టీ20 చరిత్రలో 3 సార్లు ఫైనల్‌కు(గతంలో 2007, 2014) చేరుకున్న జట్టుగా భారత్ నిలుస్తుంది. ప్రస్తుతం ఈ రికార్డు శ్రీలంక పేరిట ఉంది. 2009, 2012, 2014లో శ్రీలంక జట్టు ఫైనల్‌కు చేరుకుంది.

10 facts about India-West Indies World T20 semi-final in Mumbai

9. వరల్డ్ టీ20లో వెస్టిండిస్ 4వ సెమీ పైనల్ మ్యాచ్‌ని ఆడుతోంది. 2009, 2014లో జరిగిన మ్యాచ్‌ల్లో ఓటమి పాలవగా, 2012లో టైటిల్ విజేతగా నిలిచింది.

10. టీమిండియాను ఫైనల్‌కు ధోని తీసుకెళ్తే గనుకు చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటి వరకు ఏ కెప్టెన్ కూడా మూడు వరల్డ్ టీ20 ఫైనల్ మ్యాచ్‌లకు భారత్‌ను తీసుకెళ్లలేదు.

భారత్-వెస్డిండిస్ హెడ్ టు హెడ్ మీటింగ్:

2009 - WI won by 7 wickets at Lord's (Man-of-the-match: Dwayne Bravo)
2010 - WI won by 14 runs at Bridgetown, Barbados (Man-of-the-match: Chris Gayle)
2014 - India won by 7 wickets (Man-of-the-match: Amit Mishra)

వరల్డ్ టీ20లో భారత జట్టు సెమీఫైనల్స్ రికార్డు:
2007 (Host - South Africa) - Beat Australia by 15 runs (Won the trophy, defeating Pakistan in the final by 5 runs)
2014 (Bangladesh) - Beat South Africa by 6 wickets (Lost the final to Sri Lanka by 6 wickets)

వరల్డ్ టీ20లో వెస్టిండిస్ జట్టు సెమీఫైనల్స్ రికార్డు:
2009 (England) - Lost to Sri Lanka by 57 runs
2012 (Sri Lanka) - Beat Australia by 7 wickets (Won the trophy, beating Sri Lanka in the final by 3 wickets)
2014 (Bangladesh) - Lost to Sri Lanka by 27 runs (Duckworth/Lewis method)

WT20 విజేతలు:
2007 - India (Winner), Pakistan
2009 - Pakistan (Winner), Sri Lanka
2010 - England (Winner), Australia
2012 - West Indies (Winner), Sri Lanka
2014 - Sri Lanka (Winner), India

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+