మెల్‌బోర్న్: వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికాతో మూడు సార్లు టీమిండియా తలపడితే మూడు సార్లు పరాజయాన్ని చవిచూసింది. అయితే ఫిబ్రవరి 22(ఆదివారం)నాడు మెల్ బోర్న్‌లో జరగనున్న మ్యాచ్‌తో చరిత్రను మార్చాలని టీమిండియా భావిస్తోంది.
గత ఆదివారం ఫిబ్రవరి 15న అడిలైడ్‌లో పాకిస్ధాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 76 పరుగులతో విజయం సాధించింది. వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్ధాన్‌తో తలపడిన 6 సార్లు భారత్ విజయం సాధించడం ఆటగాళ్లలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తుంది.
పూల్ బిలో రెండో మ్యాచ్‌కి ధోని సేన సన్నద్ధమైంది. వరల్డ్ కప్‌లో నాల్గవసారి మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో టీమిండియా, దక్షిణాఫ్రికాతో ఈ ఆదివారంనాడు తలపడనుంది. భారత కాలమాన ప్రకారం మ్యాచ్ ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది.

భారత్ - దక్షిణాఫ్రికా మ్యాచ్ గురించి 10 నిజాలు:
1. వరల్డ్ కప్‌లో ఇంతవరకూ దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించలేదు. గతంలో ఆడిన మూడు సార్లు (1992, 1999, 2011) దక్షిణాఫ్రికానే విజయం సాధించింది.
2. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ లేకుండా దక్షిణాఫ్రికాతో టీమిండియా ఆడుతున్న తొలి మ్యాచ్.
3. వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికాపై సెంచరీ సాధించిన ఏకైక ఆటగాడు సచిన్ టెండూల్కరే. 2011 వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టెండూల్కర్ 111 పరుగులు సాధించాడు.
4. వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికాపై అత్యధిక పరుగలు సాధించిన ఆటగాడు సచిన్ టెండూల్కరే. మూడు ఇన్నింగ్స్‌లో సచిన్ టండూల్కర్ అత్యధికంగా 153 పరుగులు సాధించాడు.
5. వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికాపై అత్యధిక వికెట్లు తీసుకున్న ఆటగాడు హర్బజన్ సింగ్ (2011లో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌లో 3 వికెట్లు తీసుకుని 53 పరుగులు ఇచ్చాడు.)
6. వరల్డ్ కప్‌లో భారత్‌పై అత్యధక పరుగులు సాధించిన ఆటగాడిగా జాక్వస్ కల్లిస్ 165 పరుగులతో ఉన్నారు.
7. వరల్డ్ కప్‌లో భారత్‌పై ఏ ఒక్క దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ సెంచరీ చేయక పోవడం విశేషం. 1999లో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌లో కల్లిస్ 96 పరుగులు చేశాడు.
8. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ భారత్‌పై జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు తీసుకున్నారు. 2011 వరల్డ్ కప్ మ్యాచ్‌లో 5 వికెట్లు తీసుకుని 50 పరుగులిచ్చారు.
9. 2011 వరల్డ్ కప్‌లో టీమిండియా టైటిల్ ఛాంపియన్‌గా నిలిచేందుకు దోహద పడిన కోచ్ గ్యారీ కిస్టెన్, ప్రస్తుతం దక్షిణాఫ్రికాకు కోచ్‌గా వ్యవహారిస్తున్నారు. గ్యారీ కిస్టెన్ దక్షిణాఫ్రికాకు చెందిన ఆటగాడు.
10. దక్షిణాఫ్రికాపై ఎక్కు బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ కలిగిన ఆటగాడిగా కపిల్ దేవ్ ఉన్నారు. 1992లో వరల్డ్ కప్ మ్యాచ్‌లో 144.82 (42 off 29, 3x4, 1x6)తో ఉన్నారు.
భారత్ Vs దక్షిణాఫ్రికా వరల్డ్ కప్ మ్యాచ్ ఫలితాలు:
1992 - 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపొందింది.
1999 - 4 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపొందింది.
2011 - 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపొందింది.