Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్-పాక్ మ్యాచ్: 10 ఆసక్తికర విషయాలు, ఈడెన్లో వారిదే పైచేయి

కోల్‌కతా: ప్రపంచ కప్ ట్వంటీ 20లో భాగంగా ఈ నెల 19వ తేదీన కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్ - పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం కోట్లాది మంది అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.

పాకిస్తాన్ జట్టు కంటే భారత జట్టు పైనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. బంగ్లాదేశ్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలుపొందింది. అదే సమయంలో న్యూజిలాండుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడింది. ఓ మ్యాచ్ గెలిచి, అదీ ఈడెన్ గార్డెన్‌లో గెలిచి పాక్ దూకుడుగా ఉంది. భారత్ ఓటమితో ఆరంభం చేసింది.

దీంతో సహజంగానే భారత్ పైన ఒత్తిడి ఉంటుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో భారత్ - పాకిస్తాన్ జట్ల గురించి పది ఆసక్తికర విషయాలు...

10 facts about India-Pakistan World T20 match in Kolkata

1. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో పాకిస్తాన్ - భారత జట్లు ట్వంటీ 20 ఆడటం ఇదే మొదటిసారి.
2. కోల్‌కతాలో జరిగిన పరిమిత ఓవర్ల మ్యాచ్‌లలో(వన్డేలు) భారత్ పైన ఎప్పుడు పాకిస్తాన్‌దే పైచేయి. ఈడెన్ గార్డెన్‌లో పాకిస్తాన్ ఎప్పుడూ ఓడిపోలేదు. 1987, 1989, 2004, 2013లలో ఈడెన్‌లో మ్యాచులు జరిగాయి. ఈ నాలుగింటిలో పాకిస్తానే గెలిచింది.
3. ట్వంటీ 20ల్లో కోల్‌కతాలో పాకిస్తాన్ జట్టు వంద శాతం గెలుపుతో ఉంది. రెండు రోజుల క్రితం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులోను పాకిస్తాన్ 55 పరుగులతో గెలిచింది.
4. ఈ మ్యాచ్ తొలుత ధర్మశాలలో జరగవలసి ఉంది. కానీ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం భద్రత పైన అశక్తత వ్యక్తం చేసింది. దీంతో కోల్‌కతాలో జరుగుతుంది.
5. ఇప్పటికే భారత్.. న్యూజిలాండ్ జట్టు పైన ఓడింది. ఈ నేపథ్యంలో సెమీ ఫైనల్ ఆశలు ఉండాలంటే.. పాక్‌కు కలిసి వచ్చిన ఈడెన్ గార్డెన్‌లో ధోనీ సేన ఖచ్చితంగా గెలవాల్సి ఉంది.
6. భారత్ - పాకిస్తాన్ జట్లు ఏడుసార్లు ట్వంటీ 20ల్లో తలపడ్డాయి. భారత్ కేవలం ఒకే మ్యాచ్ ఓడింది. బెంగళూరులో 2012లో జరిగిన మ్యాచులో ఓడింది.
7. పాకిస్తాన్‌తో జరిగిన గత ఏడు ట్వంటీ 20 మ్యాచుల్లోను మహేంద్ర సింగ్ ధోనీయే కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ నెల 19న జరగనున్న మ్యాచులోను అతనే కెప్టెన్.
8. పాకిస్తాన్‌కు ముగ్గురు కెప్టెన్లుగా వ్యవహరించారు. మొహమ్మద్ హఫీజ్ (4 ఆటలు), షోయబ్ మాలిక్ (2)స, షాహిద్ అఫ్రిది(1). తదుపరి మ్యాచుకు అఫ్రిది కెప్టెన్.
9. ధోనీ, రోహిత్ శర్మ, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, హఫీజ్, అఫ్రిది, మాలిక్.. 2007 ట్వంటీ 20 ప్రపంచ కప్ స్క్వాడ్‌లోను ఉన్నారు. అప్పటి కప్ భారత్ గెలుచుకుంది.
10. ప్రపంచ కప్ ట్వంటీ 20ల్లో భారత్‌ను పాకిస్తాన్ ఎప్పుడు ఓడించలేదు. ఈ రెండు జట్లు నాలుగుసార్లు తలపడ్డాయి. నాలుగుసార్లు భారత్ గెలిచింది. 2007లో రెండుసార్లు, 2012లో ఒకసారి, 2014లో ఒకసారి.ట

భారత్ స్క్వాడ్: ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), అశ్విన్, బూమ్రా, ధావన్, హర్భజన్ సింగ్, రవీంద్ర జడెజా, విరాట్ కోహ్లీ, షమి, పవన్ నేగీ, ఆశిష్ నెహ్రా, హార్దిక్ పటేల్, అజింక్యా రహానే, సురేష్ రైనా, రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్.

పాకిస్తాన్ స్క్వాడ్: అఫ్రిది (కెప్టెన్), మొహమ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఉమర్ అక్మల్, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్ కీపర్), ఇమాద్ వసీమ్, అన్వర్ అలీ, మొహమ్మద్ ఇర్ఫాన్, వాహబ్ రియాజ్, మొహమ్మద్ అమిర్, మొహమ్మద్ నవాజ్, షర్జీల్ ఖాన్, మొహమ్మద్ సమి, ఖలీద్ లతిఫ్, అహ్మద్ షెహజాద్

ఈడెన్ గార్డెన్ కెపాసిటీ : 66,000

భారత్ - పాకిస్తాన్ మధ్య జరిగిన గత ఏడు ట్వంటీ 20లు. ఒకటి పాకిస్తాన్ గెలవకా, భారత్ ఆరు మ్యాచులలో గెలిచింది.

1. ప్రపంచ కప్ ట్వంటీ 20 2007లో దర్బన్‌లో జరిగింది.
2. ప్రపంచ కప్ ట్వంటీ 20 2007 ఫైనల్ (జోహన్నస్ బర్గ్) - భారత్ 5 పరుగులతో గెలుపు
3. 2012లో కొలంబోలో జరిగిన ట్వంటి 20 మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది.
4. 2012లో బెంగళూరులో జరిగిన మ్యాచులో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో గెలిచింది.
5. 2012లో అహ్మదాబాదులో జరిగిన మ్యాచులో భారత్ 11 పరుగుల తేడాతో గెలిచింది.
6. 2014లో ఢాకాలో జరిగిన ప్రపంచ ట్వంటీ 20 కప్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది.
7. 2016లో ఢాకాలో జరిగిన ఆసియా కప్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలిచింది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+