For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్-పాక్ మ్యాచ్: 10 ఆసక్తికర విషయాలు, రికార్డులన్నీ సచిన్‌వే

By Nageswara Rao

అడిలైడ్: ఐసీసీ వరల్డ్ కప్ 2015 టోర్నమెంట్లో భాగంగా మార్చి 29న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే, ఆదివారం (ఫిబ్రవరి 15) అడిలైడ్ ఓవల్‌లో జరిగే భారత్ పాక్ మ్యాచ్‌ని 'ఫైనల్ మ్యాచ్‌'గా అభిమానులు పరిగణిస్తారు.

అందుకు కారణం చిరకాల ప్రత్యర్ధులైన భారత్ - పాకిస్ధాన్ జట్లు తలపడటమే. గత కొన్ని నెలలుగా ఈ మ్యాచ్ కోసం యావత్ ప్రపంచంలో ఉన్న భారత్ - పాక్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరికొందరైతే ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్లో జరగనున్న అతి పెద్ద గేమ్‌గా దీన్నే అభివర్ణిస్తారు.

11వ ఐసీసీ వరల్డ్ కప్ ఎడిషన్‌ను ఆస్టేలియా-న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన వరల్డ్ కప్ టోర్నమంట్లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో భారత్ చేతిలో పాకిస్ధాన్ ఓటమిని చవిచూసింది.

10 facts about India-Pakistan World Cup 2015 match in Adelaide

అడిలైడ్‌లో ఆదివారం జరిగే ఈ మ్యాచ్ గురించి ఆసక్తికర అంశాలు:

1. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ లేకుండా వరల్డ్ కప్‌లో భారత్ - పాకిస్ధాన్ ఆడుతున్న మొట్ట మొదటి గేమ్ ఇదే కావడం విశేషం. గతంలో జరిగిన ఐదు వరల్డ్ కప్ గేమ్స్‌(1992, 1996, 1999, 2003, 2011) సచిన్ ఆడాడు. ఇందులో మూడు సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు(1992, 2003, 2011) సచిన్ కే దక్కింది.

2. గతంలో పాకిస్దాన్‌తో ఆడిన అనుభవం కలిగిన ఆటగాళ్లు ముగ్గురే ఉన్నారు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా (2011 వరల్డ్ కప్‌ సెమీ ఫైనల్‌లో వీళ్లు ఆడారు).

3. ఇక భారత్‌తో ఆడిన అనుభవం కలిగిన ఆటగాళ్లు పాకిస్ధాన్ జట్టులో ఐదుగురు ఉన్నారు. కెప్టెన్ మిస్బాఉల్ హక్ (2011), మాజీ కెప్టెన్ షాహిద్ అప్రది (1999, 2003, 2011), యూనిస్ ఖాన్ (03, 11), ఉమర్ అక్మల్ (11), వాహబ్ రియాజ్ (11). వీరందరిలో అప్రిదికి ఎక్కువ అనుభవం ఉంది.

4. వరల్డ్ కప్ టోర్నమెంట్లో భారత్ మూడు సార్లు పాకిస్ధాన్ జట్టుని ఆలౌట్ చేసింది. (1992, 99, 2011).

10 facts about India-Pakistan World Cup 2015 match in Adelaide

5. ఏ ఒక్క భారత్ బ్యాట్స్‌మెన్ కూడా పాకిస్ధాన్‌పై సెంచరీ సాధించక పోవడం విశేషం. 2003లో జరిగిన వరల్డ్ కప్‌లో సచిన్ టెండూల్కర్ అత్యధికంగా 98 పరుగులు చేశాడు.

6. భారత్ - పాకిస్ధాన్ మ్యాచ్‌లో ఒకే ఒక్క సెంచరీ నమోదైంది. అది కూడా పాకిస్ధాన్ ఆటగాడు సయిద్ అన్వర్ (101) 2003 వరల్డ్ కప్‌లో సాధించాడు.

7. మొట్టమొదటి భారత్ - పాక్ వరల్డ్ కప్ మ్యాచ్ మార్చి 4, 1992లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఆడారు. ఆ తర్వాతి నాలుగు వేదికలు వరుసగా.... బెంగుళూరు(96), మాంచెస్టర్ (99), సెంచూరియన్ (03), మొహాలీ (2011).

8. ఈ ఏడాది అడిలైడ్ ఓవల్‌లో భారత్ - పాకిస్ధాన్ మధ్య జరగనున్న వరల్డ్ కప్ మ్యాచ్‌కి టికెట్లు ప్రారంభించిన 20 నిమిషాల్లో అమ్ముడయ్యాయి. ఇది పెద్ద రికార్డు.

9. భారత్ - పాకిస్ధాన్ మధ్య జరిగిన ఐదు వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగులు (313- మూడు అర్ధ సెంచరీలు) చేశారు. వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్ధాన్‌పై సచిన్ టెండూల్కర్‌దే రికార్డు.

10. భారత్ - పాకిస్ధాన్ మధ్య జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లను పేసర్ వెంకటేశ్ ప్రసాద్ తీశాడు. రెండు ఇన్నింగ్స్‌లో 8 వికెట్లను తీశాడు.

స్కోరు కార్డుల వివరాలు:

*

*

*

*

*

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+