Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్-ఐర్లాండ్ మ్యాచ్: 10 ఆసక్తికర అంశాలు, గెలిస్తే ధోనీదే రికార్డ్

హామిల్టన్: ప్రపంచ కప్‌లో భాగంగా గ్రూప్ బీలో భారత జట్టు దూసుకుపోతోంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన భారత్ అన్నింట్లోను గెలిచింది. ఇప్పుడు పసికూన ఐర్లాండ్ పైన ఐదో గెలుపు కోసం ఉత్సాహపడుతోంది. పాకిస్తాన్, సౌతాఫ్రికా, యూఏఈ, వెస్టిండీస్ జట్ల పైన గెలిచిన భారత జట్టు.. మంగళవారం నాడు ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్న పసికూన ఐర్లాండ్‌తో తలపడనుంది.

భారత్ నాలుగు మ్యాచులు ఆడి నాలుగింటిలోను గెలిచింది. దీంతో ఎనిమిది పాయింట్లతో ముందంజలో ఉంది. ఐర్లాండ్ నాలుగు మ్యాచ్‌లు ఆడి మూడింట గెలిచింది. పసికూనే అయినప్పటికీ ఆకట్టుకునే ప్రదర్శన చేస్తోంది. జింబాబ్వే పైన ఉత్కంఠ పోరులో గెలిచింది. కాగా, ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలని ప్రత్యర్థి పాకిస్తాన్ కోరుకుంటోంది. ఎందుకంటే.. ఐర్లాండ్ గెలిస్తే పాక్‌కు క్వార్టర్స్ అవకాశాలు సన్నగిల్లుతాయి. పాక్, ఐర్లాండ్, సౌతాఫ్రికాలు మూడేసి విజయాలతో ఉన్నాయి.

Cricket

ఈ నేపథ్యంలో ఐర్లాండ్ - భారత్‌కు సంబంధించిన పలు విషయాలు...

ప్రపంచకప్‌లో భారత్ - ఐర్లాండ్ జట్లు తలపడటం ఇది రెండోసారి.

2011 ప్రపంచకప్‌లో తొలిసారి ఈ జట్లు తలపడ్డాయి. బెంగళూరులో ఈ మ్యాచ్ జరిగింది. ఇందులో భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది.

మొత్తం వన్డేల విషయానికి వస్తే ఈ జట్లు రెండుసార్లు తలపడ్డాయి. రెండుసార్లు కూడా భారత్ గెలిచింది. 2007లో రాహుల్ ద్రావిడ్ సారథ్యంలోని భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో ఐర్లాండ్ పైన గెలిచింది.

ఈ మ్యాచ్‌తో ధోనీ మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ రికార్డ్ బ్రేక్ చేయనున్నారు. ఐర్లాండ్ పైన గెలిస్తే.. ప్రపంచకప్‌లో అత్యధిక మ్యాచ్‌లు గెలిపించిన కెప్టెన్‌గా ధోని రికార్డ్ సృష్టిస్తాడు. ఇప్పటికి 11 విజయాలు సాధించిన ధోనీ సేన.. ఐర్లాండ్‌తో గెలిస్తే పన్నెండు విజయాలు వరుసగా సాధించినట్లవుతుంది. ప్రస్తుతం ధోనీ, కపిల్‌లు 11 గెలుపులతో సమానంగా ఉన్నారు.

ఐర్లాండ్ పైన గెలిస్తే.. ప్రపంచకప్‌లో వరుసగా తొమ్మిదో మ్యాచ్ గెలిచిన టీమ్ అవుతుంది. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచులలో గెలిచింది. 2003లో భారత్ వరుసగా ఎనిమిది మ్యాచులలో గెలిచింది. ఇప్పుడు గెలిస్తే తన రికార్డ్ తానే బద్దలు చేసుకుంటుంది.

ఐర్లాండ్ పైన వన్డేలలో అత్యధిక స్కోర్ గౌతమ్ గంభీర్ చేశాడు. 2007లో 80 పరుగులు నాటౌట్. ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్. 2011లో 50 పరుగులు నాటౌట్.

ఐర్లాండ్ పైన అత్యధిక వికెట్లు తీసింది యువరాజ్ సింగ్. అతను 2011లో 31 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు.

ఐర్లాండ్ పైన గతంలో ఆడిన వారిలో ప్రస్తుతం ముగ్గురే ఉన్నారు. ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.

2011లో ప్రపంచ కప్ ఆడిన సమయంలోను ధోనీ, పోర్టర్ ఫీల్డ్ సారథులుగా ఉన్నారు.

ప్రపంచ కప్‌లో పోర్టర్ ఫీల్డ్ అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేశాడు. 2011లో అతను 72 పరుగులు చేశాడు. ట్రెంట్ జాన్సన్, జార్డ్ డాక్ రెల్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. భారత్ పైన అత్యధిక వికెట్లు తీసిన వారు వీరే.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+