సొంతగడ్డపై భారత్‌ను ఎదుర్కొవడం చాలా కష్టం: కుక్

ఇటీవల భారత్ తమ దేశం వచ్చినప్పుడు తమ ప్రదర్శనతో ఇప్పుడు తాము చేయాల్సిన పోరాటాన్ని పోల్చి చూడడం లేదని, ఇది పూర్తిగా విరుద్ధమైన పర్యటన అని చెప్పాడు. ఈ టోర్నీలో ఎవరు ఫేవరెట్లు అన్న విషయాన్ని తాను పట్టించుకోనని, ఇది తమకు అత్యంత సవాలుతో కూడిన పర్యటన అని పేర్కొన్నాడు. చారిత్రకంగా ఉపఖండంలో పిచ్‌లు స్నిన్‌కు అనుకూలంగా ఉంటాయని, ఇప్పటి వరకూ జరిగిన ఛాంపియన్స్ లీగ్‌లో జరిగిన మ్యాచ్‌లను చూస్తే ఈ పిచ్‌లు చాలా స్లోగా ఉన్న విషయం తెలుస్తుందన్నాడు.
దీన్ని బట్టి తాము ఏ విధమైన పిచ్‌లపై ఆడనున్నామో ఊహించగలమని వ్యాఖ్యానించాడు. వన్డేల్లో ఛాంపియన్ అయిన భారత్‌తో ఆడడం మంచి అవకాశమని, ఈ పర్యటన షెడ్యూల్ గురించి తామేమీ మాట్లాడబోమన్నాడు. స్వదేశంలో భారత్‌తో తలపడిన వెంటనే మళ్లీ అదే దేశంలో పర్యటనకు రావడంపై ప్రశ్నించగా, అంతర్జాతీయ క్రీడాకారులు వివిధ పరిస్థితుల్లో ఆడాల్సి ఉంటుందని, దాన్ని తాము అనుసరిస్తామన్నాడు.
ఇంగ్లండ్‌లో ఆడిన సిరీస్‌లో కూడా లేరు కదా! సచిన్, సెహ్వగ్‌లాంటి స్టార్లు లేకున్నా భారత యువ ఆటగాళ్లలో మంచి ప్రతిభ ఉంది. అన్నింటికి మించి వారు సొంతగడ్డపై ఆడుతున్నారు. అనుభవం లేకపోయినా తమకు అలవాటైన పరిస్థితుల్లో ఎవరైనా బాగా ఆడతారు. కాబట్టి సిరీస్‌లో గట్టి పోటీ తప్పదు. ఇక ఇంగ్లండ్‌లో మేం నెగ్గిన వన్డే సిరీస్ ప్రభావం దీనిపై ఏ మాత్రం ఉండదని అన్నారు.
మా జట్టులో కూడా అనుభవజ్ఞులతో పాటు అనేక మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. చాలా మందికి భార త్‌లో పర్యటించటం ఇదే తొలిసారి. జట్టు విజయంలో భాగస్వాములు కావాలని వారు పట్టుదలగా ఉన్నారు. అయితే మా జట్టుపై ప్రస్తుతం ఎలాంటి ఒత్తిడీ లేదు.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications