యు 'వీరం': భారత్ విజయం

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ యువరాజ్ సింగ్ సెంచరీతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగుల భారీ స్కోరు చేసింది. 32 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయిన భారత్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. గంభీర్ 13, రోహిత్ శర్మ 4 పరుగులకు అవుటయ్యారు. ఈ సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన యువరాజ్ ఓపెనర్ కార్తీక్‌తో కలిసి ఆచితూచి ఆడాడు. ఇద్దరూ సమన్వయంతో ఆడుతూ స్కోరు వేగం పెంచారు. 28 ఓవర్‌లో కార్తీక్ 67 పరుగులకు అవుటయ్యాడు. యూవీకి కెప్టెన్ ధోని జత కలిశాడు. వీరిద్దరూ స్కోరును 253కు తీసుకెళ్లారు. ఈ సమయంలో యువీ 131 పరుగుల వద్ద అవుటయ్యాడు. 102 బంతుల్లో యువరాజ్ ఈ స్కోర్ సాధించాడు. వన్డేల్లో యూవీకి ఇది 12వ సెంచరీ. ధోని 41, జడేజా పరుగులేవీ చేయకుండా అవుటయ్యారు. యూసఫ్ పఠాన్ 40, హర్భజన్ 22 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. టేలర్ 1, బాకర్ 1, బ్రావో 2, బెర్నార్డ్ 1 వికెట్ చొప్పున తీసుకున్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications