Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Nikhat Zareen: తెలంగాణ బాక్సర్‌కు డీఎస్పీ ఉద్యోగం

తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌కు రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం కల్పించింది. దీనికి సంబంధించిన నియామక పత్రాన్ని డీజీపీ జితేందర్ నిఖత్‌కు బుధవారం అందజేశారు. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన ఆమెకు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

సెక్ష‌న్ 4లోని తెలంగాణ రెగ్యులేష‌న్ ఆఫ్ అపాయింట్‌మెంట్స్‌కు స‌వ‌ర‌ణ చేసి నిఖత్‌కు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇవ్వాలని హోంశాఖను ఆదేశించింది. తాజాగా దానికి సంబంధించిన నియామక పత్రాన్ని నిఖత్ జరీన్‌ను అందజేశారు. కాగా, నిజమాబాద్‌కు చెందిన నిఖత్‌కు గత ప్రభుత్వం నజారానతోపాటు, నివాస స్థలాన్ని కేటాయించిన సంగతి తెలిసిందే. అలాగే కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డును ప్రధానం చేయగా, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-1 కేడర్ ఉద్యోగం ఇచ్చింది.

World Champion Boxer Nikhat Zareen Joins Telangana Police as DSP

అలాగే కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డును ప్రధానం చేయగా, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-1 కేడర్ ఉద్యోగం ఇచ్చింది. వరల్ట్ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్ వరుసగా రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. 2022, 2023 పోటీలో టైటిల్ అందుకుంది. అలాగే కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం, ఏషియన్ గేమ్స్‌లో కాంస్య పతకాలు సాధించింది. కాగా, ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో నిఖత్ నిరాశపరిచింది. మహిళల 50 కేజీల విభాగంలో ప్రీక్వార్టర్స్‌లోనే ఇంటిముఖం పట్టింది.

Story first published: Wednesday, September 18, 2024, 20:45 [IST]
Other articles published on Sep 18, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+