48 కిలోల విభాగంలో జరిగిన సెమీఫైనల్లో
టోర్నీలో భాగంగా సెమీ ఫైనల్స్ 48 కిలోల విభాగంలో జరిగిన సెమీఫైనల్లో ఉత్తర కొరియా బాక్సర్ కిమ్ హ్యాంగ్ మిని చిత్తుగా ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. దీంతో మేరీకోమ్‌కి కనీసం రజత పతకం ఖాయమైంది. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో మేరీకోమ్ ఇప్పటికే ఐదు సార్లు విజేతగా నిలిచింది.
ఫైనల్లో ఉక్రెయిన్ బాక్సర్‌తో తలపడనున్న మేరీ కోమ్
శనివారం జరిగే ఫైనల్లో ఉక్రెయిన్ బాక్సర్ హన్నా ఒహోటాతో స్వర్ణం కోసం పోటీపడనుంది. మేరీ కోమ్ 2010లోనూ ఇలానే 48 కేజీల విభాగంలో పోటీపడి స్వర్ణ పతకాన్ని గెలుపొందింది. ఈ పోటీకి ముందు ఆమె ఐర్లాండ్ బాక్సర్ కేటీ టేలర్ (5 స్వర్ణాలు, 1 కాంస్యం)తో పతకాల పరంగా సమంగా ఉంది. ఇప్పుడు మేరీ ఫైనల్ చేరుకుంది.
మేరీ కోమ్ స్వర్ణం గెలిస్తే చరిత్రే
ఈ నేపథ్యంలో ఫైనల్లో మేరీ కోమ్ స్వర్ణం గెలిస్తే బాక్సింగ్ ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. గాయం కారణంగా గత కొన్నాళ్లుగా ఒడిదొడుకులు ఎదుర్కొన్న ఈ బాక్సర్.. తాజా టోర్నీ ఆరంభం నుంచి సూపర్ ఫామ్‌లో కొనసాగుతోంది. ప్రస్తుతం మేరీ వయసు 35 ఏళ్లు. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

గోల్‌కోస్ట్ కామన్‌వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించిన మేరీ కోమ్
కుటుంబ బాధ్యతలతో గత కొన్నాళ్లుగా బాక్సింగ్‌కు దూరంగా ఉన్న మేరీ కోమ్ 2018 గోల్‌కోస్ట్ కామన్‌వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించింది. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్స్‌షిప్‌లో ఇప్పటికే మేరీకోమ్ ఐదు స్వర్ణాలు, ఒక రజతం గెలుపొందగా.. శనివారం మరో పతకం ఆమె ఖాతాలో చేరనుంది.


Click it and Unblock the Notifications












