Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

2020 ఒలింపిక్స్‌.. విజేందర్‌, గోయత్‌లకు గ్రీన్‌సిగ్నల్‌

with-bfi-paving-way-for-pros-vijender-singh-and-neeraj-goy

చెన్నై: దాదాపు రెండేళ్ల క్రితం భారత స్టార్ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ ప్రొషెనల్‌ రింగ్‌లోకి అడుగుపెట్టడంతో దేశం తరపున అధికారిక ఈవెంట్లలో పాల్గొనే అవకాశం లేకపోయింది. అయితే ప్రొఫెషనల్‌ బాక్సర్లగా మారిన వాళ్లు ఇకపై దేశం తరఫున ఆడేందుకు సైతం అనుమతిస్తూ భారత బాక్సింగ్‌ ఫెడరేషన్‌ (బీఎఫ్‌ఐ) నిర్ణయం తీసుకుంది. దీంతో విజేందర్‌కు ఓ సువర్ణావకాశం దొరికింది.

ఒలింపిక్స్‌ సహా అన్ని అధికారిక క్రీడల్లో భారత ప్రొఫెషనల్‌ బాక్సర్ల పాల్గొనే అవకాశాన్ని బీఎఫ్‌ఐ కల్పించడంతో విజేందర్‌కు మెగా ఈవెంట్‌లో తన సత్తాను మరోసారి చాటేందుకు అవకాశం వచ్చింది. బీజింగ్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన విజేందర్‌.. వచ్చే ఏడాది జరుగనున్న టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు విజేందర్‌కు అవకాశం దొరికింది. మరో భారత ప్రొఫెషనల్‌ బాక్సర్‌ నీరజ్‌ గోయత్‌కు కూడా ఒలింపిక్స్‌ బాక్సింగ్‌ రింగ్‌లో పాల్గొనే ఛాన్స్ దక్కింది.

తాజాగా విజేందర్‌ మాట్లాడుతూ... 'కచ్చితంగా ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి ఆసక్తిగా ఉన్నాను. నాకు ప్రొఫెషనల్‌ అయినా, అమెచ్యూర్‌ అయినా ఒక్కటే. ఎక్కడైనా రెండొందల శాతం ప్రదర్శను ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటా. మరొకసారి భారత జెండాను నా షర్ట్‌పై చూడాలనుకుంటున్నా. దేశం కోసం పోరాడటం ఎప్పుడూ గౌరవమే' అని అన్నాడు. ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలంటే అంతకుముందు జరిగే క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌లో విజేందర్‌, గోయత్‌లు తలపడాల్సి ఉంటుంది. ఇక ఒలింపిక్స్‌కు వెళ్లాలా, వద్దా అనే నిర్ణయం కూడా వీరి చేతుల్లోనే ఉంది.

Story first published: Sunday, September 1, 2019, 21:13 [IST]
Other articles published on Sep 1, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+