Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మార్చి 30న మహా 'యుద్ధం': రికీ ఫీల్డింగ్‌తో విజేందర్‌ ఢీ

Vijender Singh's 10th pro-boxing bout against Rocky Fielding in United Kingdom on March 30

హైదరాబాద్: భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ తదుపరి బాక్సింగ్ బౌట్ ఖరారైంది. మార్చి 30వ తేదీన యునైటెడ్ కింగ్‌డమ్‌లో బ్రిటన్‌కు చెందిన కామన్వెల్త్‌ సూపర్‌ మిడిల్‌వెయిట్‌ చాంపియన్‌ రికీ ఫీల్డింగ్‌తో విజేందర్‌ తలపడనున్నాడు. ఈ మేరకు వీరిద్దరి ఫైట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది.

ఐఓఎస్‌కు చెందిన బాక్సర్స్ మేనేజ్‌మెంట్ దీనిపై మాట్లాడుతూ వచ్చే ఏడాది మార్చి 30న జరిగే ఈ బాక్సింగ్ బౌట్‌లో రికీ ఫీల్డింగ్‌ తన సూపర్‌ మిడిల్‌ వెయిట్‌ టైటిల్‌తో బరిలోకి దిగుతున్నట్లు తెలిపింది. కాగా, ఈ ఏడాది సెప్టెంబర్‌ 30న డేవిడ్‌ బ్రోఫీతో జరిగిన బౌట్‌లో విజేందర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

దీంతో ఫీల్డింగ్‌ సూపర్‌ మిడిల్‌వెయిట్‌ టైటిల్‌ను విజేందర్ దక్కించుకున్నాడు. ప్రొ బాక్సర్‌గా కెరీర్‌ మొదలుపెట్టినప్పటి నుంచి ఓటమనేదే లేకుండా దూసుకుపోతున్న విజేందర్‌ ప్రస్తుతం ఓరియంటల్‌ సూపర్‌ మిడిల్‌వెయిట్‌ టైటిల్‌తో కొనసాగుతున్నాడు.

కాగా, ప్రొ బాక్సింగ్‌లో విజేందర్‌‌కు 9-0 రికార్డు ఉన్నప్పటికీ, అనుభవం ఎక్కువగా ఉన్న రికీ ఫీల్డింగ్‌తో బౌట్ అంటే సవాల్‌తో కూడుకున్నదేనని బాక్సింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తన కెరీర్‌లో 26 ఫైట్‌ల్లో పాల్గొన్న 30 ఏళ్ల రికీ ఫీల్డింగ్‌ 25 విజయాలు సాధించాడు. అందులో 14 నాకౌట్‌లు ఉన్నాయి.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, November 22, 2017, 11:35 [IST]
Other articles published on Nov 22, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+