Mary Kom: నాకింకా వయసైపోలేదు.. 40 ఏళ్ల వరకూ ఆడతా! ఈ నిబంధనలు మనకే ఎందుకు?!

Tokyo Olympics 2021 : Mary Kom Questions Change Of Ring Dress At Tokyo Olympics | Oneindia Telugu

ఢిల్లీ: తాను బాక్సింగ్‌ ఆడేందుకు ఇంకా వయసు ఉందని, 40 ఏళ్లు వచ్చే వరకూ ఆటను కొనసాగిస్తానని భారత వెటరన్ బాక్సర్‌, ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీ కోమ్‌ తెలిపారు. జపాన్ వేదికగా జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌ 2020లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన మేరీ కోమ్‌ అనూహ్యంగా ప్రీక్వార్టర్స్‌లో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఓటమితో భారత్ పతక ఆశలు గల్లంతయ్యాయి. టోక్యో నుంచి శనివారం మేరీ కోమ్‌ స్వదేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఢిల్లీ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలపై స్పందించారు.

40 ఏళ్లు వచ్చేవరకు ఆడుతా

40 ఏళ్లు వచ్చేవరకు ఆడుతా

ఒలింపిక్స్‌ 2020లో పతకం సాధించలేకపోయారు.. ఇక బాక్సింగ్‌కు వీడ్కోలు పలుకుతారా? అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు మేరీ కోమ్‌ సమాధానం ఇచ్చారు. 'పతకం తీసుకురాకుండా దేశానికి తిరిగి రావటం చాలా చాలా బాధగా ఉంది. కచ్చితంగా పతకంతో భారత్‌కు తిరిగి వస్తానని భావించా. దేశం మొత్తం నాకు మద్దతుగా నిలిచింది.

ప్రీక్వార్టర్స్‌లో న్యాయ నిర్ణేతలు వ్యవహరించిన తీరు సరిగా లేదు. నేను తొలి రెండు రౌండ్లు గెలిచాను. నేనెలా ఓడిపోతాను?. మరోసారి దేశానికి, ప్రజలకు క్షమాపణలు చెబుతున్నా. నా వయసు ఇంకా అయిపోలేదు. 40 ఏళ్లు వచ్చేవరకు బాక్సింగ్‌లో కొనసాగుతా. అవసరమైతే వచ్చే ఒలింపిక్స్‌లో పాల్గొంటా' అని ఆమె జవాబిచ్చారు.

మనకే ఎందుకు ఇలా

మనకే ఎందుకు ఇలా

జెర్సీ వివాదంపైనా మేరీ కోమ్‌ మాట్లాడుతూ... 'బౌట్‌కు ముందు అధికారులు నా దగ్గరకు వచ్చి..మీ సొంత జెర్సీని వాడకూడదు అని చెప్పారు. తొలి మ్యాచ్‌లో అదే జెర్సీ వేసుకున్నా. అప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. మా కిట్‌ను చెక్‌ చేస్తామని ముందే చెప్పాల్సింది.

నా మానసిక ఆందోళన దెబ్బతీయడానికే వారు అలా చేశారని అనిపిస్తుంది. కేవలం మనకి మాత్రమే ఇలా చెప్పడమేంటి? ఇతర దేశాలకు లేని నిబంధనలు మనకే ఎందుకు' అంటూ ప్రశ్నించారు. మేరీ కోమ్‌ ప్రస్తుత వయసు 38 ఏళ్లు. ఆమె మాటలను బట్టి చూస్తే.. మరో రెండేళ్లు ఆడనున్నారు.

Tokyo Olympics 2021: చ‌రిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా స్విమ్మ‌ర్‌.. ఒకే ఒలింపిక్స్‌లో 7 పతకాలు!!

జ‌డ్జీల నిర్ణ‌యంపై అసంతృప్తి

జ‌డ్జీల నిర్ణ‌యంపై అసంతృప్తి

టోక్యో ఒలింపిక్స్ 2021లో ప్రిక్వార్ట‌ర్స్‌లోనే మేరీ కోమ్ అనూహ్యంగా ఓడిన విష‌యం తెలిసిందే. రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత ఇంగ్రిట్‌ వాలెన్సియా (కొలంబియా) చేతిలో 3-2 తేడాతో ఆమె ఓడిపోయారు. 48-51 కిలోల విభాగంలో జరిగిన ప్రి క్వార్టర్‌ ఫైనల్లో మేరీ కోమ్‌ 27-30, 28-29, 30-27, 28-29, 29-28 తేడాతో ఓటమి పాలయ్యారు.

బౌట్‌ ఆసాంతం కదులుతూ ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించినా చివరకు మేరీకి పరాజయమే మిగిలింది. రౌండ్ ఆఫ్ 16లో తాను గెలిచాన‌ని భావించి సంబ‌రాలు చేసుకున్న దిగ్గజ బాక్స‌ర్ మేరీ.. ఆ త‌ర్వాత ఓడిన విష‌యం తెలుసుకొని జ‌డ్జీల నిర్ణ‌యంపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. అయితే తాజాగా మేరీ కోమ్ త‌న రింగ్ డ్రెస్‌పై లేవ‌నెత్తిన సందేహాలు చూస్తుంటే.. ఆమెకు అన్యాయం జ‌రిగిందా అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, August 1, 2021, 15:49 [IST]
Other articles published on Aug 1, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X