Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మహిళా బాక్సర్‌కు సాయం: పతకం తేవాలంటూ ట్విట్టర్‌లో సుష్మ

Sushma helps boxer with passport, wants medal in return

హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీ మంత్రి వర్గంలో విదేశీ వ్యవహారాల శాఖను నిర్వహిస్తున్న సుష్మా స్వరాజ్ అత్యంత సమర్ధనీయత కలిగిన మహిళా మంత్రిగా అందరి మన్ననలను అందుకుంటున్న సంగతి తెలిసిందే. సమ్యసల్లో ఉన్నవారికి తాను ఎప్పటికీ అండగా నిలుస్తునన సంగతి తెలిసిందే. తాజాగా, సుష్మాస్వరాజ్ మరోమారు తన సహృదయతను చాటుకున్నారు.

వివరాల్లోకెళితే..
ఇటీవలి జాతీయ జూనియర్ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఝలక్ తోమర్ అనే బాక్సర్ 54 కేజీల విభాగంలో కాంస్య పతకం నెగ్గింది. దీంతో ఆమె అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీ అయిన 'వాలెరియా దెమ్యనోవా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీ'లో బరిలో దిగేందుకు అర్హత సాధించింది.

ఈ టోర్నీ కోసం తోమర్ ఉక్రెయిన్‌కు బయల్దేరివెళ్లాల్సి వచ్చింది. అయితే సకాలంలో పాస్‌పోర్ట్ వచ్చే అవకాశం లేకపోవడంతో తోమర్ తన సమస్యను ట్విట్టర్ ద్వారా మంత్రి సుష్మా దృష్టికి తీసుకెళ్లింది. దీనికి సుష్మా వెంటనే స్పందించడం విశేషం.

'పాస్‌పోర్ట్ విషయమై అధికారులతో మాట్లాడాను.. ఉదయాన్నే నీకు అందుతుంది. కానీ నువ్వు దేశం తరఫున కచ్చితంగా పతకం గెలిచి తీసుకురావాల్సిందే' అంటూ సుష్మా తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇక, ఝలక్ తోమర్ విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలోని ఓ చిన్న గ్రామానికి చెందినది.

చిన్నప్పటి నుంచి బాక్సింగ్ అంటే ఎంతో ఆసక్తి. ఇటీవలే జాతీయ జూనియర్ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఝలక్ తోమర్ అనే బాక్సర్ 54 కేజీల విభాగంలో కాంస్య పతకం నెగ్గింది. దీంతో ఆమె ఉక్రెయిన్‌లో జరిగే అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీకి అర్హత సాధించింది.

Story first published: Tuesday, November 14, 2017, 11:46 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+