పుల్వామా ఉగ్రదాడి: సీఆర్పీఎఫ్ జవాన్లకు ఈ స్వర్ణం అంకితం

హైదరాబాద్: స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో తాను సాధించిన స్వర్ణ పతకాన్ని పుల్వామా ఉగ్రదాడిలో వీర మరణం పొందిన సీఆర్పీఎఫ్ జవాన్లకు అంకితం ఇస్తున్నానని తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ అన్నారు. స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో నిఖత్ జరీన్ స్వర్ణంతో చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. బల్గేరియా రాజధాని సోఫియాలో జరిగిన ఈ టోర్నీలో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళా బాక్సర్‌గా రికార్డు నెలకొల్పింది.

స్వర్ణం సాధించిన నిఖత్ జరీన్
స్వర్ణం సాధించిన అనంతరం నిఖత్ జరీన్ మాట్లాడుతూ "ఈ స్వర్ణం పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు అంకితం ఇస్తున్నాను. ఈ ఘటన దేశ పౌరుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఫైనల్లో ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకుండా పోరాడాను. ఈ స్వర్ణం నా సామర్థ్యంపై ఉన్న సందేహాలకు బదులిచ్చిందని అనుకుంటున్నా" అని నిఖత్ జరీన్ అన్నారు.

రజతంతో సరిపెట్టుకున్న మంజు రాణి
ఇదే టోర్నీలో నిఖత్ జరీన్‌తో పాటు మీనా కుమారి కూడా స్వర్ణం సాధించి ఈ ఘనత సాధించింది. ఫైనల్లో మీనా కుమారి 54కేజీ విభాగంలో 3-2తో ఐరా విల్లెగాస్ (ఫిలిప్పీన్స్)ను ఓడించి విజేతగా నిలిచింది. గతేడాది ఇదే టోర్నీలో మీనా కాంస్య పతకానికే పరిమితమైంది. మరోవైపు మంజు రాణి (48 కేజీలు) రజతంతో సరిపెట్టుకుంది.
మేరీకోమ్ (రజతం) ప్రదర్శనే అత్యుత్తమం
గతంలో మహిళల విభాగంలో భారత్ తరఫున మేరీకోమ్ (రజతం) ప్రదర్శనే అత్యుత్తమంగా ఉంది. ఇక, పురుషుల విభాగంలో ఆసియా గేమ్స్ విజేత అమిత్ పంఘల్ (49 కేజీ) వరుసగా రెండో స్వర్ణంతో సత్తా చాటాడు. హర్యానాకు చెందిన అమిత్ ఫైనల్లో 5-0తో కజకిస్థాన్‌కు చెందిన టెమిర్టస్‌ను చిత్తు చేశాడు.

పురుషుల్లో స్వర్ణం సాధించిన అమిత్ పంఘల్
మొత్తంగా ఈ టోర్నీలో భారత్ మూడు స్వర్ణాలు, ఓ రజతం, మూడు కాంస్యాలతో ఏడు పతాకాలను సాధించింది. గతేడాది అత్యధికంగా 11 పతకాలు సాధించడం గమనార్హం. పురుషుల విభాగంలో స్వర్ణం సాధించిన అమిత్ పంఘల్ కూడా తాను సాధించిన స్వర్ణాన్ని పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు అంకితమిచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications