న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tokyo Olympics 2021: వైరల్ వీడియో.. ఓటమి బాధలో ప్రత్యర్థి చెవి కొరికేశాడు!!

Moroccan boxer Youness Baalla trying to bite opponent David Nyikas ear in Tokyo Olympics 2020

టోక్యో: ఏ ఆటలోనైనా గెలుపు, ఓటములు సహజం. ప్రత్యర్ధులు గెలిచే సమయంలో కొందరు స్లెడ్జింగ్ చేస్తుంటారు, మరికొందరు వారి ఏకాగ్రతను చెడగొడుతుంటారు. ఇంకొందరు వ్యక్తిగత దూషణకు దిగుతారు. ఇవేమి వర్కౌట్ కాకుంటే.. మ్యాచ్ అనంతరం తమ ప్రతీకారం తీసుకుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే జపాన్ వేదికగా జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌ 2020లో చోటుచేసుకుంది. మ్యాచ్‌లో ఓడిపోతున్నాననే అసహనంతో మొరాకొకు చెందిన బాక్సర్‌ యూనెస్‌ బాల్లా.. న్యూజిలాండ్‌ బాక్సర్‌ డేవిడ్‌ న్యీకా చెవి కొరికాడు.

Tokyo Olympics 2021: ఒలింపిక్స్ నుంచి సాయి ప్ర‌ణీత్ ఔట్‌.. లీడ్‌లోకి దూసుకెళ్లి మరీ!!Tokyo Olympics 2021: ఒలింపిక్స్ నుంచి సాయి ప్ర‌ణీత్ ఔట్‌.. లీడ్‌లోకి దూసుకెళ్లి మరీ!!

మంగళవారం బాక్సింగ్‌లో హెవీ వెయిట్‌ విభాగంలో మొరాకొకు చెందిన బాక్సర్‌ యూనెస్‌ బల్లా, న్యూజిలాండ్‌కు చెందిన డేవిడ్‌ నికా మధ్య పోరు జరిగింది. బౌట్‌లో డేవిడ్‌ నికా తొలి నుంచి ఆధిపత్యం ప్రదర్శించగా.. యూనెస్‌ బల్లా తేలిపోయాడు. దీంతో అసహనానికి గురైన యూనెస్‌.. మూడో రౌండ్‌లో డేవిడ్‌ చెవి కొరకడానికి యత్నించాడు. యూనెస్‌ దంతాలు తగలగానే డేవిడ్‌ అతడిని దూరంగా నెట్టేశాడు. ఈ మ్యాచ్‌లో డేవిడ్‌ 5-0 తేడాతో యూనీస్‌ను ఓడించాడు.

యూనెస్‌ బల్లా అనుచిత ప్రవర్తనతో ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌ అతడిని అనర్హుడిగా ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్‌లో షేర్‌ చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది. యూనెస్‌ బల్లా చేసిన పనిని సామాజిక మాధ్యమాల్లో అభిమానులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కానీ డేవిడ్‌ నికా మాత్రం ప్రత్యర్థిని వెనకేసుకొచ్చాడు. 'క్రీడల్లో ఇలాంటి మామూలే. అతడి అసహనాన్ని అర్ధం చేసుకోగలను. ఆటగాడిగా బల్లాను గౌరవిస్తున్నా' అని నికా పేర్కొన్నాడు. గతంలో బాక్సింగ్‌ దిగ్గజం మైక్‌ టైసన్‌ ఇలానే ప్రత్యర్థి చెవి కొరికాడు. 1997లో ఇవాండర్‌ హోలీఫీల్డ్‌ చెవిని టైసన్‌ కొరకడం అప్పట్లో పెద్ద సంచలనం అయింది.

Story first published: Wednesday, July 28, 2021, 17:54 [IST]
Other articles published on Jul 28, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X