న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాక్సింగ్ రింగ్‌లోకి తిరిగి వస్తున్నా.. మైక్ టైసన్ సంచలన ప్రకటన!!

Mike Tyson again hints at comeback in latest training video

ఢిల్లీ: మాజీ ప్ర‌పంచ హెవీవెయిట్ బాక్సింగ్‌ చాంపియ‌న్, అమెరికా మాజీ ప్రొఫెషనల్ బాక్సర్ మైక్ టైస‌న్ సంచలన ప్రకటన చేసారు. టైస‌న్ మ‌ళ్లీ త‌న పంచ్ ప‌వ‌ర్ చూపించ‌నున్నారు. బాక్సింగ్‌లో శిక్షణ పొందుతున్న తన వీడియోను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్టు చేసి.. 'నేను తిరిగి బాక్సింగ్ రింగ్‌లోకి వస్తున్నా' అంటూ టైసన్ మెసేజ్ పెట్టారు. దీంతో బౌట్ స‌త్తా చాటేందుకు మైక్ టైస‌న్ ప్రిపేర‌వుతున్న‌ట్లు సమాచారం తెలుస్తోంది.

టెన్నిస్‌కు ఫెదరర్ ఎలానో.. క్రికెట్‌కు కోహ్లీ అలా: డివిలియర్స్టెన్నిస్‌కు ఫెదరర్ ఎలానో.. క్రికెట్‌కు కోహ్లీ అలా: డివిలియర్స్

53 ఏళ్ల మైక్ టైసన్ వర్కవుట్ చేస్తూ చిత్రీకరించిన షార్ట్ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో బాక్సింగ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. వేగం, పంచ్ పవరుతో హెవీ వెయిట్‌గా నిలిచి పలు టైటిళ్లు సాధించిన టైసన్.. మళ్లీ బాక్సింగ్ రింగ్ లోకి దిగుతుండటం ఆసక్తికరంగా మారింది. ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళాల సేకరణ కోసమే మైక్ టైసన్ బాక్సింగ్ రింగ్‌లోకి దిగుతున్నారని సమాచారం.

భారీ భారీ పంచ్‌ల‌తో ఎందరో గొప్ప బాక్స‌ర్ల‌ను మ‌ట్టిక‌రిపించిన టైస‌న్‌.. విరాళాల సేక‌ర‌ణ కోసం ఛారిటీ మ్యాచ్‌లు నిర్వ‌హించాల‌నుకుంటున్నారు. దీని కోసం అత‌ను ఎగ్జిబిష‌న్ బౌట్‌లు ఆడాల‌ని నిశ్చయించుకున్నారు. డ‌బ్ల్యూబీఏ, డ‌బ్ల్యూబీసీ, ఐబీఎఫ్ టైటిళ్ల‌ను గెలిచిన మైక్‌.. ప్రాక్టీస్ వీడియోలో త‌న పంచ్ ప‌వ‌ర్‌, వేగం త‌గ్గ‌లేద‌ని చూపించారు.

మైక్ టైసన్ రిటైర్ మెంటుకు ముందు పాల్గొన్న 58 బాక్సింగ్ పోటీల్లో 50 విజయాలు సాధించారు. 2005లో కెవిన్ మెక్‌బ్రైడ్‌తో టైసన్ చివ‌రి బౌట్‌లో త‌ల‌ప‌డ్డారు. 20 ఏళ్ల వ‌య‌సులోనే టైసన్ .. 1986లో ట్రెవ‌ర్ బెర్‌బిక్‌ను ఓడించి ప్ర‌పంచ యువ హెవీవెయిట్ బాక్సింగ్‌ చాంపియ‌న్‌గా ఖ్యాతి గాంచారు. మాజీ చాంపియ‌న్ ఇవాండ‌ర్ హోలీఫీల్డ్‌తో టైస‌న్ త‌న ఎగ్జిబిష‌న్ బౌట్‌లో త‌ల‌ప‌డే అవ‌కాశాలు ఉన్నాయని సమాచారం తెలుస్తోంది.

Story first published: Tuesday, May 12, 2020, 11:58 [IST]
Other articles published on May 12, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X