న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియా ఓపెన్: స్వర్ణం నెగ్గిన మేరీకోమ్‌, అమిత్ పంగల్

India Open Boxing : Mary Kom And Shivva Thapa Win Gold Medals || Oneindia Telugu
Mary Kom, Shiva Thapa dominate finals as Amit Panghal fights his way to gold at 2nd India Open

హైదరాబాద్: ఇండియా ఓపెన్‌ బాక్సింగ్‌ టోర్నీలో భారత బాక్సర్లు సత్తా చాటారు. గతంలో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్‌ మహిళల 51 కేజీల విభాగంలో స్వర్ణంతో మెరిసింది. ఈ టోర్నీలో భారత బాక్సర్లు ఎనిమిది విభాగాల్లో స్వర్ణ పతకాలను సాధించారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

ఫైనల్లో మేరీకోమ్‌ 5-0తో భారత్‌కే చెందిన వన్‌లాల్‌ దువాటిపై విజయం సాధించింది. సరితా దేవి (60 కేజీలు), జమున బోరో (54 కేజీలు), నీరజ (57 కేజీలు) కూడా స్వర్ణాలు సాధించారు. ఈ టోర్నీలో భారత్‌ మొత్తం 12 బంగారు పతకాలు దక్కించుకుంది.

ఫైనల్స్‌లో సరితా దేవి 3-2తో సిమ్రన్‌జిత్‌ కౌర్‌ (భారత్‌)పై, జమున 5-0తో సంధ్యారాణి (భారత్‌)పై, నీరజ 5-0తో మనీషా (భారత్‌)పై విజయం సాధించారు. ఇక, 48 కేజీల విభాగం ఫైనల్లో మోనిక (భారత్‌) 2-3తో గబుకో (ఫిలిప్పీన్స్‌) చేతిలో, లవ్లీనా (భారత్‌) 2-3తో అసుంతా (ఇటలీ) చేతిలో ఓడి రజతాలను సొంతం చేసుకున్నారు.

పురుషుల విభాగంలో దీపక్‌ (49 కేజీలు), అమిత్‌ (52 కేజీలు), ఆశిష్‌ (69 కేజీలు), శివ థాపా (60 కేజీలు) స్వర్ణ పతకాలు సాధించారు. ఫైనల్స్‌లో అమిత్‌ 4-1తో సచిన్‌ సివాచ్‌ (భారత్‌)పై, దీపక్‌ 5-0తో గోవింద్‌ (భారత్‌)పై, ఆశిష్‌ 4-1తో దుర్యోధన్‌ (భారత్‌)పై, శివ థాపా 5-0తో మనీశ్‌ (భారత్‌)పై విజయం సాధించారు.

Story first published: Saturday, May 25, 2019, 9:41 [IST]
Other articles published on May 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X