Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పరిశీలకురాలి పదవికి రాజీనామా చేసిన బాక్సర్ మేరీ కోమ్

Mary Kom resigns as boxing’s National Observer

హైదరాబాద్: భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ బాక్సింగ్‌ పరిశీలకురాలి పదవికి రాజీనామా చేసింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల వివాదం నెలకొనడంతోనే మేరీ కోమ్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కెరీర్ కొనసాగిస్తున్న క్రీడాకారులు ఎవరైనా ఇలాంటి పదవుల్లో ఉండకూడదన్న కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్దన్‌ సింగ్‌ రాథోడ్ ఆదేశాలతో మేరీ కోమ్ రాజీనామా చేసినట్లు ప్రకటించింది.

గతంలో క్రీడా కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ తనను కోరితే ఈ పదవిలో ఉండేందుకు అంగీకరించానని, కోరుకోని పదవికోసం అనవసరం వివాదం ఎందుకని పదవికి రాజీనామా చేసినట్లు మేరీ కోమ్ తెలిపింది. విజయ్‌ గోయల్ కేంద్ర క్రీడల మంత్రిగా ఉన్న సమయంలో ఒలింపిక్ పతక విజేత అభినవ్ బింద్రా, రెజ్లర్ సుశీల్ కుమార్, బాక్సర్ అఖిల్ సహా 12 మందిని జాతీయ పరిశీలకులుగా నియమించారు.

అయితే వీరిలో మేరీ కోమ్‌తో పాటు రెజ్లర్ సుశీల్ కుమార్ ఇంకా కెరీర్ కొనసాగిస్తున్నారు. మరోవైపు బాక్సర్ అఖిల్ మాత్రం తనపై వచ్చిన పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలను తోసిపుచ్చాడు. తాను ఇప్పుడు కేంద్ర క్రీడాశాఖ ఇచ్చే ఎలాంటి ప్రయోజనాలు పొందడం లేదని స్పష్టం చేశాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, December 2, 2017, 12:43 [IST]
Other articles published on Dec 2, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+