క్వారంటైన్‌ను పక్కన పెట్టి.. విందుకు హాజరైన మేరీకోమ్!!

ఢిల్లీ: ప్రస్తుతం మహమ్మారి కరోనా వైరస్ (కోవిడ్-19) గురించి ప్రపంచమంతా ఎంత చర్చ జరుగుతోందో అందరికి తెలిసిన విషయమే. కరోనాను ఇప్పుడు విస్మరించాల్సిన విషయం కాదు. ఈ వైరస్ సోకినట్లయితే ప్రాణానికే ప్రమాదం. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ వైరస్ కారణంగా అన్ని దేశాల ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు విధించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు.. ఇతర దేశాల నుంచి వచ్చేవారు స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆదేశించాయి. కానీ.. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్, భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ క్వారంటైన్‌ను పక్కన పెట్టి మరీ ఓ విందుకు హాజరయ్యారు.

ప్రెసిడెంట్ అల్పాహార విందు:
ఇటీవల జోర్డాన్‌లోని అమన్‌లో జరిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్ టోర్నీలో పాల్గొన్న మేరీకోమ్.. మార్చి 13న స్వదేశానికి తిరిగి వచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు ఇతర దేశాల నుంచి వచ్చేవారు 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండాలి కాబట్టి మేరీకోమ్ క్వారంటైన్‌కు వెళ్లారు. అయితే మార్చి 18న రాష్ట్రపతి భవన్‌లో ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ ఇచ్చిన అల్పాహార విందుకు ఆమె హాజరయ్యారు.

సోషల్ మీడియాలో వైరల్:
విందు అనంతరం రాష్ట్రపతి అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోటోలను పోస్ట్ చేసారు. 'ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ పార్లమెంట్ సభ్యులకు రాష్ట్రపతి కోవింద్ ఈ ఉదయం అల్పాహార విందును ఇచ్చారు' అని కాప్షన్ రాసుకొచ్చారు. ఫోటోలలో మేరీకోమ్ ఉన్నారు. మేరీతో పాటు ఇతర పార్లమెంటు సభ్యులు కూడా ఉన్నారు. దీంతో విషయం బయటకు వచ్చింది. అయితే తాను రాష్ట్రపతి ఇచ్చిన విందుకు హాజరైనట్లు మేరీ అంగీకరించారు.

విందుకు హాజరయ్యా:
'జోర్డాన్ నుండి భారత్‌కు వచ్చినప్పటి నుండి నేను ఇంట్లోనే ఉన్నాను. కేవలం రాష్ట్రపతి ఇచ్చిన అల్పాహార విందుకు మాత్రమే హాజరయ్యా. అక్కడ బీజేపీ శాసనసభ్యుడు దుష్యంత్‌ను కలవలేదు, కనీసం ఎవరితో కరచాలనం చేయలేదు. తదుపరి 3-4 రోజులు నేను ఇంట్లోనే ఉండబోతున్నాను' అని మేరీకోమ్ ఓ ప్రకటనలో తెలిపారు.

టోక్యో ఒలింపిక్స్‌కు మేరీకోమ్:
బాక్సర్ మేరీకోమ్ (51 కేజీలు) టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్ టోర్నీలో సెమీస్‌కు చేరడంతో ఆమెకు టోక్యో బెర్తు ఖాయమైంది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో మేరీకోమ్ కాంస్య పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. భారత అగ్రశ్రేణి బాక్సర్లు అమిత్ పంఘాల్ (52 కేజీలు), సిమ్రన్‌జిత్ కౌర్ (60 కేజీలు) కూడా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ఒలింపిక్స్‌కు భారత్ తరఫున 9మంది బాక్సర్లు అర్హత సాధించడం ఇదే తొలిసారి. లండన్ (2012)కు 8మంది క్వాలిఫై కావడమే ఇప్పటి వరకు అత్యుత్తమం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications